news

News June 21, 2024

నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి: రేణూ దేశాయ్

image

భర్త వదిలేశారని తనను దురదృష్టవంతురాలిగా పేర్కొనడం ఎంతో బాధిస్తోందని నటి రేణూ దేశాయ్ అన్నారు. అందంగా ఉండి, మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్‌లక్కీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాతో ఉన్నవాటితో నేను సంతోషంగా ఉన్నా. లేనివాటి గురించి బాధలేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్స్ సరికాదు. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి వారితో ప్రవర్తించాలి’ అని రిప్లై ఇచ్చారు.

News June 21, 2024

సూర్యకుమార్ యాదవ్ రికార్డు

image

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ T20 మ్యాచుల్లో అత్యధిక POTM అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌గా నిలిచారు. SKY 64 మ్యాచుల్లోనే 15 సార్లు అవార్డును అందుకున్నారు. కింగ్ కోహ్లీ 120 మ్యాచుల్లో 15సార్లు POTMలు అందుకొని సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మలేషియా ప్లేయర్ విరన్‌దీప్ సింగ్(14), జింబాబ్వే ప్లేయర్ సికందర్ రాజా(14), అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(14) ఉన్నారు.

News June 21, 2024

త్వరలో గులాబీ పార్టీ ఖాళీ: దానం

image

TG: తమ పార్టీలో చేరేందుకు చాలామంది BRS నేతలు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ MLA దానం నాగేందర్ అన్నారు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైందని, త్వరలో 20మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరతారని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంప ముంచాయని, త్వరలో గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని దానం జోస్యం చెప్పారు.

News June 21, 2024

అధికారికంగా రామోజీ సంస్మరణ కార్యక్రమం

image

AP: రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27న కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. కాగా అనారోగ్య సమస్యలతో రామోజీరావు జూన్ 8న మరణించిన విషయం తెలిసిందే.

News June 21, 2024

జగన్‌కు గౌరవం ఇవ్వండి: సీఎం చంద్రబాబు

image

AP:మాజీ CM జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకు అనుమతించాలని CBN అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షనేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో CM ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని MLAలకు CM సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని TDP సహచరులకు బాబు తెలిపారు.

News June 21, 2024

USలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డ్: ట్రంప్

image

‘అమెరికా ఫస్ట్’ అంటూ వలసదారులపై విమర్శలతో విరుచుకుపడే ట్రంప్ ఈసారి రూటు మార్చారు. అధ్యక్షుడిగా గెలిస్తే USలోని విదేశీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే గ్రీన్ కార్డూ లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు తిరిగి వెళ్లిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వదేశాలకు వెళ్లి వారు వేల మందికి ఉపాధి కల్పించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారని తెలిపారు.

News June 21, 2024

బొగ్గు గనులు వేలంలో ఉంచడం బాధాకరం: భట్టి

image

TG: రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా వేలం వేయడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYDలో నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు సింగరేణి మూతపడే ప్రమాదం ఉందన్నారు.

News June 21, 2024

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో జులై 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

News June 21, 2024

నీట్ కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ

image

నీట్ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని NTAకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను పెండింగ్ పిటిషన్లతో కలిపి విచారించనుంది. తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.

News June 21, 2024

బొగ్గు గనుల వేలం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి దూబే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. వేలంలో సింగరేణి పాల్గొంటుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. అంతకుముందు కిషన్ రెడ్డితో భట్టి, సింగరేణి సీఎండీ బలరాం భేటీ అయ్యారు. శ్రావణపల్లి గనిని సింగరేణికి కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.