news

News June 20, 2024

CS పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి సీఎం లేఖ

image

AP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. నీరభ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగించాలని సీఎం కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తొలుత 3 నెలల పాటు సర్వీస్ పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 20, 2024

ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లు: దినకర్

image

AP: జగన్ సీఎంగా దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లకు చేరినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. వీటిలో బడ్జెట్ రుణాలు రూ.5.50 లక్షల కోట్లు, బడ్జెటేతర రుణాలు రూ.7.50 లక్షల కోట్లని చెప్పారు. వీటన్నింటికి కలిపి రోజుకు రూ.250 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఏపీ పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు.

News June 20, 2024

నేటి నుంచి గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

TG: నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఆగస్టు 21వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్ నంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను <>వెబ్‌సైట్‌<<>>లో పేర్కొంది. మరోవైపు గ్రూప్-2 దరఖాస్తుల వివరాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగియనుంది.

News June 20, 2024

అఫ్గానిస్థాన్‌తో అంత ఈజీ కాదు

image

T20 వరల్డ్ కప్ సూపర్-8లో రోహిత్ సేన అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా లీగ్ దశలో న్యూజిలాండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు లీగ్ దశలో విఫలమైన కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

News June 20, 2024

నేడు అమరావతికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబునాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు.

News June 20, 2024

వాయు కాలుష్యంతో రోజుకు 2వేల మంది చిన్నారులు మృతి: రిపోర్ట్

image

ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్‌-హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారకంగా ఉందని వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్‌పై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

News June 20, 2024

త్వరలో ‘సికందర్’ మూవీ షూట్‌లోకి రష్మిక

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ సినిమా షూటింగ్‌లో త్వరలోనే పాల్గొంటానని హీరోయిన్ రష్మిక తెలిపారు. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ నటిస్తున్నారు. తాజాగా సల్మాన్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. త్వరలోనే తానూ షూటింగ్‌లో జాయిన్ అవుతానని రష్మిక రీట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేసే యోచనలో టీమ్ ఉంది.

News June 20, 2024

నీట్ కూడా రద్దు చేయండి: ప్రతిపక్షాలు

image

యూజీసీ-<<13472127>>నెట్<<>> తరహాలోనే నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘నెట్ రద్దు లక్షలాది విద్యార్థుల విజయం. ఇది అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి పరాభవం. మోదీజీ.. నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారు? నీట్ పరీక్షలోనూ పేపర్ లీకేజీకి మీరే బాధ్యత తీసుకొండి’ అని Xలో పేర్కొన్నారు. ఈ లీకేజీలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా అని ప్రియాంక ప్రశ్నించారు.

News June 20, 2024

అభిమాని మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు: దర్శన్

image

కర్ణాటకలో సంచలనంగా మారిన అభిమాని రేణుకాస్వామి <<13457717>>హత్య<<>> అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు మరో నిందితుడికి దర్శన్ రూ.30 లక్షలు అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. స్వయంగా నటుడు దర్శన్ ఈ విషయాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ హత్య కేసులో దర్శన్‌తో సహా 17 మంది నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

News June 20, 2024

జూన్ 20: చరిత్రలో ఈ రోజు

image

1876: గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు చందాల కేశవదాసు జననం
1939: భారత మాజీ క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ జననం
1958: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జననం
1984: సినీ నటి నీతూ చంద్ర జననం
1987: భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం
2001: ప్రపంచ శరణార్థుల దినోత్సవం