News June 20, 2024

త్వరలో ‘సికందర్’ మూవీ షూట్‌లోకి రష్మిక

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ సినిమా షూటింగ్‌లో త్వరలోనే పాల్గొంటానని హీరోయిన్ రష్మిక తెలిపారు. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ నటిస్తున్నారు. తాజాగా సల్మాన్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. త్వరలోనే తానూ షూటింగ్‌లో జాయిన్ అవుతానని రష్మిక రీట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేసే యోచనలో టీమ్ ఉంది.

Similar News

News September 9, 2024

జో రూట్ ఖాతాలో మరో రికార్డు

image

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రూట్ (12,402) అవతరించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుమార సంగక్కర (12,400) రికార్డును ఆయన అధిగమించారు. మరో 83 పరుగులు చేస్తే అలిస్టర్ కుక్ (12,472) రికార్డు కూడా రూట్ బద్దలుకొడతారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.

News September 9, 2024

నాటో పరిధిలో కుప్పకూలిన రష్యా డ్రోన్

image

రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్‌ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.

News September 9, 2024

సెప్టెంబర్ 09: చరిత్రలో ఈరోజు

image

1914: కవి కాళోజీ నారాయణరావు జననం
1935: నటుడు, కూచిపూడి కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1953: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1987: బాల మేధావి తథాగత్ అవతార్ తులసి జననం
తెలంగాణ భాషా దినోత్సవం