India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ బిహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన PM
✒ పంటల కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం
✒ AP: భారీగా ఐఏఎస్‌ల బదిలీ
✒ AP: వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు: షర్మిల
✒ AP: పవన్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు
✒ యూజీసీ NET-2024 రద్దు
✒ సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు విజయం
✒ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్ బై
TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఓ హోంమంత్రి కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్‌లో సెటైరికల్ పోస్ట్ చేసింది. ‘తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు. హత్యలు, అత్యాచారాలు, ఘర్షణలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వీటిని అణిచివేసేందుకు వెంటనే రాష్ట్రానికి హోంమంత్రి కావాలి’ అని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
T20 వరల్డ్ కప్ సూపర్-8 తొలి మ్యాచులో యూఎస్ఏపై దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డికాక్(74), మార్క్రమ్(46) రాణించారు. చేధనలో యూఎస్ఏ 176 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ గౌస్(80) చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ రబడ 3 వికెట్లు తీశారు.
హీరోయిన్ రిమీ సేన్ రూ.4.14 కోట్లు మోసపోయారు. అధిక వడ్డీకి ఆశపడి మూడేళ్ల క్రితం తన ఫ్రెండ్ రోనక్ వ్యాస్‌కు విడతల వారీగా ఆమె రూ.4.14 కోట్లు ఇచ్చారు. అవి వడ్డీతో సహా రూ.14 కోట్ల మేర అయ్యాయి. కానీ అతడు కనిపించకుండా పోవడంతో ఆమె ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసు సీఐడీకి బదిలీ అయింది. కాగా నీతోడు కావాలి, అందరివాడు సినిమాల్లో రిమీ సేన్ నటించారు.
NEET పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పట్నాలో నీట్ అవకతవకలపై విచారణ జరుగుతోందని, బిహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.
కేంద్ర విద్యాశాఖ తాజాగా UGC NET-2024 (National Eligibility Test)ను రద్దు చేసింది. అయితే NEET, NET పేర్లు దాదాపు ఒకే రకంగా ఉండటంతో చాలా మంది NEET రద్దు చేశారని అయోమయపడుతున్నారు. కేంద్రం రద్దు చేసింది NETని మాత్రమే. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత కోసం NET నిర్వహిస్తే.. BDS, MBBS కోర్సుల్లో అడ్మిషన్లకు NEET (National Eligibility-cum-Entrance Test) నిర్వహిస్తారు.
>>SHARE IT
AP: జగన్ తప్పిదాలు, చేతగానితనంతో పోలవరం ప్రాజెక్టు గాడి తప్పిందని టీడీపీ విమర్శించింది. ‘ఒక అసమర్థుడి మూర్ఖత్వానికి పోలవరం బలైంది. అధికారం ఇచ్చారని రాష్ట్రాన్నే గోదావరిలో ముంచేశారు. మొత్తం సరి చేసి, పోలవరాన్ని మళ్లీ గాడిలో పెడుతుంది ప్రజా ప్రభుత్వం’ అని ట్వీట్ చేసింది. 2019 మే నాటికి, 2024 మే నాటికి ప్రాజెక్టులో ఎంత శాతం పనులు పూర్తయ్యాయనే దానిపై ఓ పట్టికను పోస్ట్ చేసింది.
నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA ప్రకటించింది. పేపర్ లీకైందని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై CBI విచారణకు ఆదేశించింది. మరోసారి NET నిర్వహిస్తామని ప్రకటించింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి దీనిని నిర్వహిస్తారు. మరోవైపు NEETలో అవకతవకలు జరిగాయని ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి.
‘గజిని’ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయమని స్టార్ హీరోయిన్ నయనతార అన్నారు. ‘‘గజిని’ సినిమాలో ముందు అనుకున్న విధంగా నా పాత్రను తెరకెక్కించలేదు. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా సూర్య, అసిన్ జంటగా తెరకెక్కిన ‘గజిని’ మూవీ 2005లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో నయనతార కీలకపాత్ర పోషించారు.
Sorry, no posts matched your criteria.