news

News June 17, 2024

వచ్చే 3 రోజుల పాటు వర్షాలు

image

AP: వచ్చే 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలంగా కదులుతుండటం, ద్రోణి ప్రభావం కూడా ఉండటం దీనికి కారణమని తెలిపింది. ఉత్తరాంధ్ర మొదలు కాకినాడ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.

News June 17, 2024

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించింది. నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసింది.

News June 17, 2024

‘తారే జమీన్ పర్’ సీక్వెల్ షూటింగ్ పూర్తి

image

సూపర్ హిట్ మూవీ ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘సితారే జమీన్ పర్’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించిన ఈ మూవీలో ఆమిర్ ఖాన్‌కు జోడీగా జెనీలియా నటించారు. గత చిత్రంలా కాకుండా ఈ సీక్వెల్ ప్రేక్షకులను నవ్విస్తుందని తెలిపారు. ఈ సినిమాకు ఆమిర్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ ఏడాది క్రిస్మస్‌కు మూవీని విడుదల చేయనున్నట్లు సమాచారం.

News June 17, 2024

ఆగస్టు నుంచి ఫాక్స్‌కాన్ ఉత్పత్తులు

image

TG: ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ఫాక్స్‌కాన్ ఆగస్టు నుంచి రాష్ట్రంలో ప్రొడక్షన్ ప్రారంభించనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలాన్‌లో రూ.1200 కోట్లతో నెలకొల్పిన ప్లాంట్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ సంస్థ ద్వారా తొలి ఏడాదిలో 25వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనుండగా, పదేళ్లలో దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది.

News June 17, 2024

నేపాల్ బౌలర్ల ధాటికి బంగ్లా విలవిల

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కింగ్స్‌టౌన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు దుమ్మురేపారు. 106 రన్స్‌కే ఆ జట్టును ఆలౌట్ చేశారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్(17 రన్స్)దే అత్యధిక స్కోరు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర, రోహిత్, సందీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడితే బంగ్లా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమవుతాయి.

News June 17, 2024

2029 నాటికైనా పోలవరాన్ని చూస్తామా?

image

AP: పోలవరం రాష్ట్ర జీవనాడి. ప్రాజెక్టు ప్రతిపాదనలు.. వాటికి ఆమోదాలు. ఒక్కో ప్రభుత్వం ఒక్కో శిలాఫలకం. బాలారిష్టాలు దాటి పనులు ప్రారంభం. దీనికే దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రాజెక్టు ఓ కొలిక్కి రాలేదు. కేంద్రం సాయంతో ఈసారి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని NDA ప్రభుత్వం అంటోంది. మరి 2029 నాటికైనా ఈ ప్రాజెక్టు నుంచి గోదారమ్మ పరవళ్లు చూస్తామా? అని రాష్ట్ర ప్రజానీకం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

News June 17, 2024

జనసేనకు డిప్యూటీ స్పీకర్ అవకాశం

image

AP: జనసేనకు <<13454433>>డిప్యూటీ స్పీకర్<<>> పదవి ఇవ్వాలని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. ఎవరికి ఇవ్వాలన్నదానిపై టీడీపీ, జనసేన అధినేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్‌గా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

News June 17, 2024

కూత వినపడాలంటే శ్రద్ధ పెట్టాల్సిందే!

image

ఇతర రాష్ట్రాల కంటే రైల్వే నెట్‌వర్క్‌లో వెనుకబడిన తెలంగాణలో రైల్వే లైన్ల సర్వేలే ఏళ్లుగా సాగుతున్నాయి. ఇంకా రైలు కూత వినని ప్రాంతాలెన్నో ఉన్నాయి. తుది సర్వే మంజూరైన ప్రాజెక్టులు 30 ఉండగా.. వీటి పనుల విలువ దాదాపు రూ.83,543 కోట్లు. జూలైలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మన MPలు శ్రద్ధ పెడితేనే ఇవి పట్టాలెక్కుతాయి. 15 కొత్త మార్గాలు, 8 డబ్లింగ్, 3 ట్రిప్లింగ్ ప్రాజెక్టులు ప్రతిపాదనల్లోనే ఉన్నాయి.

News June 17, 2024

రూ.2లక్షల రుణమాఫీపై BIG UPDATE

image

TG: ఆగస్టు 15లోపు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాస్‌బుక్‌లు, రేషన్‌కార్డులున్న వారి రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. MPలు, MLAలు, MLCలు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం. కేబినెట్‌లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 DEC 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది.

News June 17, 2024

గూడూరు-రేణిగుంట మూడో లైన్‌కు గ్రీన్‌సిగ్నల్

image

AP: గూడూరు-రేణిగుంట మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ లైన్ నిర్మించనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య 83.17KM దూరానికి రూ.884 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. 2 రైల్వే వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే విజయవాడ-గూడూరు మధ్య 3వ లైన్ పూర్తికావొస్తోంది.