India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మన దేశంలో పొలిటికల్ సక్సెస్‌కి నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యానికి సంబంధం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. ‘కల్పిత సమస్యల సాకుతో ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలవు?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను టార్చర్ చేయడం ఆపాలని సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ‘వదినగారూ దేవుడిని పెళ్లి చేసుకుని, ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది’ అని కామెంట్ చేశారు. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ‘పవన్‌ను నేను వదిలేయలేదు. ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్‌లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌పై వేటు పడింది. ఆయనను GAD(సాధారణ పరిపాలన విభాగం)కి అటాచ్ చేస్తూ GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్‌పై చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీలో నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నిస్తున్నారని ఆప్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. నగరంలోని ప్రధాన పైపులైన్లలో చాలా చోట్ల బోల్టులు తొలగించి ఉన్నట్లు గుర్తించామని మంత్రి అతిశీ తెలిపారు. దీంతో లీకేజీలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ క్రమంలో పైపులైన్ల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు. కాగా యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తింది.
AP: పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంతకం కోసం ఆమె ఫైల్ తీసుకురాగా ఆయన నిరాకరించారు. ఆమెను బదిలీ చేసేవరకు ఫైళ్లు మూవ్ చేయొద్దని, జీఓలపై ఆమె సంతకాలు ఉండరాదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం శ్రీలక్ష్మి ఇచ్చిన బొకే తీసుకునేందుకు సీఎం చంద్రబాబు నిరాకరించడం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ లేమికి కారణం ఇప్పటి వరకు ఆడిన పేలవమైన పిచ్‌లేనని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘విరాట్ సహా ఆ పిచ్‌లపై ఆడిన ఏ బ్యాటర్‌నూ తప్పుపట్టలేం. వాటిపై ఆడటం కష్టంగా కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఫామ్‌ను అంచనా వేయకూడదు. తన నుంచి పరుగుల్ని ఆశిస్తాం కరెక్టే కానీ పరిస్థితుల్నీ చూడాలి కదా. సూపర్-8లో కోహ్లీ ఫామ్ అందుకుంటారు’ అని పేర్కొన్నారు.
TG: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి వస్తున్న ఆయనను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్ల దృష్ట్యా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. రేపు మెదక్ వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించడంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
TG: హైదరాబాద్ సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలపై బదిలీ వేటు వేశారు. ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడటం సహా పలు ఆరోపణలతో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు.
TG: గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను TGPSC ఖరారు చేసింది. జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు. CBRT విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.
ఓవర్ ప్రొటెక్టివ్ డాడీ (ఎప్పుడూ మీ వెంటే ఉండేవారు), ది కూల్ డాడీ (ఏం జరిగినా ఓ నవ్వు నవ్వేవారు), ఎమోషనల్ డాడీ (ముఖ్యమైన ఈవెంట్లలో ఏడ్చేవారు), ఫ్యాషన్ డాడీ (అస్సలు డ్రెస్ సెన్స్ లేనివారు), హ్యాపీ డాడీ (ఇంట్లో అన్ని పనులు చేసేవారు), డిజాస్టర్ డాడీ (తన కోసం కూడా వంట చేసుకోలేని వారు), యాక్సిడెంటల్ డాడీ (మీకు సహాయం చేయాలని ఉన్నా ప్రమాదానికి గురై మంచంలో ఉన్నవారు). మీ ఫాదర్ ఎలాంటి వారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.