news

News June 16, 2024

TBJP కొత్త సారథి ఎవరు?

image

TG: రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. ఈ పదవి కోసం కొందరు తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ (MP), డీకే అరుణ (MP), ధర్మపురి అరవింద్ (MP), వెంకటరమణారెడ్డి (MLA), రామ్‌చందర్ రావు (EX MLC), పేరాల చంద్రశేఖర్ అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా, ఇటు అధ్యక్షుడిగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News June 16, 2024

కొనసాగుతున్న మ్యాక్స్‌వెల్ ఫ్లాప్ షో

image

ఐపీఎల్‌లో పేలవమైన ప్రదర్శనతో విమర్శల పాలైన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ టీ20 WCలోనూ విఫలమవుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచులో 28 రన్స్ చేసిన ఆయన ఒమన్‌పై 0, స్కాట్లాండ్‌పై 11 పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో అతని బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2024లో RCB తరఫున 9 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్ 52 రన్స్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

News June 16, 2024

వచ్చే నెలలో జీశాట్-ఎన్2 ప్రయోగం!

image

జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,700 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్‌లోకి పంపనున్నారు. దీని జీవితకాలం 14 ఏళ్లు. దేశ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ దీనిని రూపొందించింది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ సహా భారత్ మొత్తానికి దీని సేవలు అందనున్నాయి.

News June 16, 2024

శ్రీవారి దర్శనానికి 30 గంటలు

image

వేసవి సెలవులు ముగిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వారితో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో టోకెన్లు లేని వారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. అటు నిన్న 82వేల మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

News June 16, 2024

వరుస ఉగ్రదాడులు.. నేడు షా కీలక సమావేశం

image

J&Kలో ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తదితరులు హాజరు కానున్నారు. ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతపైనా షా చర్చించనున్నారు.

News June 16, 2024

టెట్ పాసైన వారికి గుడ్ న్యూస్

image

TG: టెట్ పాసైన వారు DSCకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం <>వెబ్‌సైట్‌లో<<>> మార్పులు చేసింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేనందున, DSCకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. టెట్ పాస్ కానివారు వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

News June 16, 2024

‘పబ్జీ’ ప్రియుడి కోసం.. యూపీకి అమెరికా యువతి

image

ఆ మధ్య పబ్జీ ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ తరహాలోనే మరో ఘటన జరిగింది. USకు చెందిన బ్రూక్లిన్(30)కు, UPలోని ఇటావాకు చెందిన హిమాన్షుతో పబ్జీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నాళ్ల క్రితం చండీగఢ్‌లో కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమెను ఇటావాకు తీసుకురాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగీకారంతోనే అతడిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.

News June 16, 2024

నేతలకు అడ్డా.. మంత్రులకు ‘కొండ’పి!

image

AP: ఇప్పటివరకు కొండపి నియోజకవర్గానికి చెందిన ఆరుగురు మంత్రులయ్యారు. ఈ సెగ్మెంట్‌కు చెందిన చెంచురామానాయుడు, GV శేషు, దామచర్ల ఆంజనేయులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, గంటా శ్రీనివాసరావు, DBV స్వామి అమాత్యులుగా పనిచేశారు. వీరిలో కొందరు కొండపి నుంచే గెలిచి మంత్రులయ్యారు. మరికొందరు ఇతర సెగ్మెంట్ల నుంచి గెలిచి అమాత్యులయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

News June 16, 2024

SBI లోన్లు తీసుకున్నవారికి షాక్

image

అన్ని కాలవ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను SBI 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 1-3నెలల వడ్డీ రేటు 8.20% నుంచి 8.30%కి, 6 నెలల వడ్డీ రేటు 8.55% నుంచి 8.65%కి పెరిగింది. ఏడాదికి వడ్డీ రేటు 8.65% నుంచి 8.75%కి, రెండేళ్లకు 8.75% నుంచి 8.85%కి చేరింది. దీంతో ఏడాది MCLRకు అనుసంధానమై ఉన్న గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.

News June 16, 2024

పాక్ జట్టులో ఆ ఐదుగురిని పీకేయండి: అహ్మద్ షెహజాద్

image

T20 WCలో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డారు. పాక్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. ‘నాలుగైదేళ్లుగా బాబర్, రిజ్వాన్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రీది, హారీస్ రవూఫ్ రెగ్యులర్‌గా ఆడుతున్నారు. వీరంతా వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పాక్ క్రికెట్ నాశనమైంది. వీరిని జట్టు నుంచి తప్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు.