News June 16, 2024

కొనసాగుతున్న మ్యాక్స్‌వెల్ ఫ్లాప్ షో

image

ఐపీఎల్‌లో పేలవమైన ప్రదర్శనతో విమర్శల పాలైన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ టీ20 WCలోనూ విఫలమవుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచులో 28 రన్స్ చేసిన ఆయన ఒమన్‌పై 0, స్కాట్లాండ్‌పై 11 పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో అతని బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2024లో RCB తరఫున 9 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్ 52 రన్స్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 14, 2024

సాధారణ వైద్య సేవలు బంద్: వైద్యుల సంఘం

image

కోల్‌కతాలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమత నుంచి తమకు సరైన స్పందన రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

News October 14, 2024

ఇప్పుడున్నది పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టు: వాన్

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్న జట్టు, పాక్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టని తేల్చిచెప్పారు. ‘నాకు తెలిసినంత వరకూ ఇదే అత్యంత వరస్ట్ టీమ్. ఎటువంటి రిస్కులూ లేకుండా ఇంగ్లండ్ చాలా సునాయాసంగా 823 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌‌కు రూట్ ప్రత్యేకమైన ఆటగాడు. కచ్చితంగా సచిన్ రికార్డును బద్దలుగొడతాడు’ అని అంచనా వేశారు.

News October 14, 2024

టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై తాప్సీ ఆగ్రహం

image

టర్కిష్ ఎయిర్ లైన్స్‌పై హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘విమానం 24 గంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికుల సమస్య కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇటీవల శృతి హాసన్ కూడా ఇండిగో సంస్థపై మండిపడిన సంగతి తెలిసిందే.