India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20WCలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు 3 మ్యాచులు ఆడగా అతడి గణాంకాలు(రన్స్ 0, వికెట్లు 0, క్యాచ్‌లు 0) పేలవంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్ అయ్యారు. గత మ్యాచ్‌లో బౌలింగే వేయలేదు. దీంతో అతడి స్థానంలో జైస్వాల్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అతడు మంచి ఓపెనింగ్ ఇస్తారని, కోహ్లీని వన్‌డౌన్‌లో దించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
AP: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈసారి ఉద్యోగాల కల్పనలో ఏపీ ఇతర రాష్ట్రాలకు పోటీ ఇస్తుందని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు. ఇందుకోసం 2019లో వదిలిపెట్టిన చోటు నుంచే తిరిగి పనులు ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
TG: బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేటీఆర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సిరిసిల్ల ఆర్‌వోకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది.
పొలిటికల్ సినిమాలు తీయనని ఇప్పటికే ప్రకటించిన రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఆ మాటను నొక్కి చెప్పారు. కొత్త దర్శకులను పరిచయం చేసే ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పొలిటికల్ బయోపిక్స్ జోలికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. కాగా వ్యూహం, శపథం వంటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను ఆయన తీశారు. ఇవి చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను ఉద్దేశించే తీశారంటూ ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
AP: తనకు కంగ్రాట్స్ చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు <<13439772>>చేసిన<<>> ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘సీఎం గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వ సూచనలతో మంత్రుల సమష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాల పురోగతికి పాటుపడతాం. సుసంపన్న ఆంధ్రప్రదేశ్ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని ట్వీట్ చేశారు.
TG: పాఠ్యపుస్తకాల్లో CM పేరు తప్పుగా ముద్రణ కావడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు SCERT అడిషనల్ డైరెక్టర్ ఎం.రాధారెడ్డి, టెక్ట్స్ బుక్స్ ప్రెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారిని బాధ్యులుగా గుర్తిస్తూ బదిలీ వేటు వేసింది. కాగా పుస్తకాల్లో CM రేవంత్ పేరుకు బదులుగా KCR పేరును ముద్రించారు. దీంతో 35 లక్షల పుస్తకాలు, వర్క్ బుక్స్ ముందు పేజీలను చింపి KCR పేరు కనపడకుండా వెనకాల అంటిస్తున్నారు.
వంగలపూడి అనిత.. 1984 జనవరి 1న విశాఖ జిల్లా లింగరాజుపాలెంలో జన్మించారు. ఏయూ నుంచి ఎంఏ, ఎంఈడీ పట్టాలు పొంది కొన్నేళ్ల పాటు ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2014లో పాయకరావుపేట నుంచి టీడీపీ MLA అయ్యారు. 2019లో ఓటమి తర్వాత TDP రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఏకంగా హోంమంత్రి అయ్యారు.
TG: పెద్దపల్లి(D) సుల్తానాబాద్‌లో బాలికపై <<13437328>>హత్యాచారం<<>>, నారాయణపేట్(D) ఉట్కూర్‌లో వ్యక్తిని కొట్టి <<13438774>>చంపిన<<>> ఘటనలను CM రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. హత్యాచార నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
AP: కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు చనిపోగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా మొత్తం 45 మంది భారతీయులు ఈ ప్రమాదంలో చనిపోగా వారి మృతదేహాలు ఇవాళ స్వదేశానికి చేరుకున్నాయి.
TS: ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో సతమతమవుతున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ‘గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా పోర్టల్ తీసుకొచ్చింది. మా హామీ మేరకు ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. దాని కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేసేందుకు కమిటీ వేశాం. ధరణిని బలోపేతం చేసి, సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా మార్చనున్నాం’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.