news

News June 13, 2024

తెరపైకి కిరణ్ బేడీ బయోపిక్

image

భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. దీనికి ‘బేడీ: ది నేమ్ యు నో, ది స్టోరీ యు డోంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కుషాల్ చావ్లా దర్శకత్వం వహిస్తుండగా, గౌరవ్ చావ్లా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ‘ఇది భారత్‌లో పెరిగి, చదువుకొని దేశ ప్రజల కోసం పనిచేసిన ప్రతి స్త్రీ కథ’ అని బేడీ ఓ ప్రకటనలో తెలిపారు.

News June 13, 2024

త్వరలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు!

image

TG: ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. దీనికోసం మొబైల్ ల్యాబ్‌లను సిద్ధం చేయనుంది. 26-70 ఏళ్ల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. NHMలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చనున్నాయి.

News June 13, 2024

అతి శీతలం.. 71 లక్షల పశువులు మృతి

image

మంగోలియాలో తీవ్ర అనావృష్టి తర్వాత తీవ్రమైన చలికాలం వస్తే దాన్ని ‘జడ్’ అంటారు. దీన్నొక ప్రకృతి వైపరీత్యంగా పరిగణిస్తారు. అక్కడ ‘జడ్’ కారణంగా మే నెలాఖరుకు దాదాపు 71 లక్షల పశువులు మరణించాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1.49 కోట్లకు చేరొచ్చని అంచనా. ఇది ఆ దేశ పశు సంపదలో 24 శాతానికి సమానం. మంగోలియా జనాభా 33 లక్షలైతే 6.5 కోట్ల పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి.

News June 13, 2024

ఏపీలో నేడు స్కూళ్లు రీఓపెన్

image

AP: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యా కానుకను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు టీచర్లు అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని PM-పోషణ్ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు. పాఠశాలలు నిన్నే రీఓపెన్ కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

News June 13, 2024

జులై 2న వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం!

image

ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలై సచ్‌దేవ్‌ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. జులై 2న థాయ్‌లాండ్‌లో వివాహం జరగనుంది. శరత్‌కుమార్‌-రాధిక దంపతులు ఇప్పటికే వివాహ పనులు మొదలు పెట్టారట. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

News June 13, 2024

పాక్ టీమ్‌కు సపోర్టు చేయను: వసీం అక్రమ్

image

పాకిస్థాన్ టీమ్‌లో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఓటములపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఏమనుకున్నా ఇకపై తమ జట్టుకు సపోర్టు చేయబోనని స్పష్టం చేశారు. తన మాటలు వైరలైనా పట్టించుకోనని తెలిపారు. ‘జట్టులోని ఆటగాళ్లకు విభేదాలున్నట్లు కనిపిస్తోంది. మీరంతా దేశం కోసం ఆడుతున్నారని గుర్తించండి. ఇకనైనా అన్నీ పక్కన పెట్టి క్రికెట్ ఆడండి’ అని సూచించారు.

News June 13, 2024

జెన్‌కో ఏఈ పోస్టుల భర్తీకి జులై 14న పరీక్ష

image

తెలంగాణ జెన్‌కోలో ఏఈ పోస్టుల భర్తీకి వచ్చే నెల 14న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సీఎండీ రిజ్వీ తెలిపారు. జులై 3 నుంచి హాల్‌టికెట్లను సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. 339 పోస్టులకు గత ఏడాది అక్టోబర్ 4న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31న రాత పరీక్ష జరగాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడింది.

News June 13, 2024

ఆ ఒక్క కేబినెట్ బెర్త్ ఎవరికో?

image

AP: రాష్ట్ర కేబినెట్‌లో 24 మందికి(టీడీపీ-21, జనసేన-3, బీజేపీ-1) అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు ఒక్క బెర్తును ఖాళీగా ఉంచారు. దీంతో ఆ స్థానం టీడీపీ నేతలకే ఇస్తారా? లేక మిత్ర పక్షాలకు కేటాయిస్తారా? అనే చర్చ మొదలైంది. బీజేపీ మరో పదవి కోరుతోందని సమాచారం. అయితే పార్టీలో అసంతృప్తులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

News June 13, 2024

పాక్‌ జిందాబాద్ నినాదాలు.. గ్యాంగ్‌స్టర్‌కు దేహశుద్ధి

image

కర్ణాటకలోని బెళగావి కోర్టు ప్రాంగణంలో జయేశ్ పూజారి అలియాస్ షకీల్ అనే గ్యాంగ్‌స్టర్ పాక్ జిందాబాద్ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు జయేశ్‌ను కాపాడి జైలుకు తరలించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ చేయడం సహా పలు హత్య కేసుల్లో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ కేసు విచారణ కోసం కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News June 13, 2024

40 ఏళ్ల తర్వాత చిత్తూరుకు దక్కని మంత్రి పదవి

image

AP: రాష్ట్ర కేబినెట్‌లో చిత్తూరు జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఇలా జరగడం 40ఏళ్లలో రెండోసారి మాత్రమే. 1983లో TDP ఆవిర్భవించిన తర్వాత NTR తిరుపతి నుంచి గెలిచారు. 15 మందితో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో చిత్తూరు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కలేదు. ఈసారి 14 స్థానాలకు 12 గెలిచినా పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. అదే జిల్లాకు చెందిన చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వలేదని సమాచారం.