news

News June 12, 2024

గొట్టిపాటి రవికుమార్ రాజకీయ ప్రస్థానమిదే

image

* 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ.. మార్టూరు ఎమ్మెల్యేగా ఎన్నిక
* 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపు
* 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
* 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం
* 2024లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపు.. కేబినెట్‌లో చోటు

News June 12, 2024

వాట్సాప్‌లో ‘రీసెంట్ కమ్యూనిటీ మీడియా’ ఫీచర్!

image

వాట్సాప్‌లో కమ్యూనిటీ గ్రూప్స్‌కు సంబంధించి ‘రీసెంట్ కమ్యూనిటీ మీడియా’ ఫీచర్ రానుంది. దీనితో గ్రూపుల్లో రీసెంట్‌గా షేర్ చేసిన మీడియా ఫైల్స్‌ను ఆయా గ్రూపుల్లోని సభ్యులు సెపరేట్ సెక్షన్‌లో సులభంగా చూడవచ్చు. అలాగే ఏ ఫైల్ సైజు ఎంత అనే వివరాలు కూడా కనిపిస్తాయి. దీంతో అవసరం లేని, లార్జ్ ఫైల్స్‌ను గుర్తించి యూజర్లు డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది.

News June 12, 2024

AP మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు వీరే..

image

AP: 24 మంది మంత్రుల్లో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.
1. అనిత వంగలపూడి (పాయకరావుపేట-SC): 2014లో పాయకరావుపేట TDP అభ్యర్థిగా గెలిచారు. 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు.
2. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు- ST): డిప్యూటీ సీఎం రాజన్న దొరపై 13వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
3.ఎస్.సవిత (పెనుకొండ-BC కురుబ): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్‌పై గెలిచారు.

News June 12, 2024

KOHLI: పద్నాలుగేళ్ల క్రితం ఇదే రోజు..!

image

టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ T20ల్లోకి ఎంట్రీ ఇచ్చి నేటితో పద్నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన భారత్ తరఫున 119 T20లు ఆడారు. అత్యధిక పరుగులు (4,042), అత్యధిక ఫిఫ్టీలు (37), అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు (15), సిరీస్‌లు (7), వరల్డ్ కప్‌లో అత్యధిక రన్స్ (1146), వరల్డ్ కప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు (14), WCలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు, సిరీస్‌లు కూడా ఆయన ఖాతాలోనే ఉన్నాయి.

News June 12, 2024

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన చంద్రబాబు

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఉదయం 10.40 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ విమానం ల్యాండ్ కానుంది. అక్కడ మోదీకి బాబు స్వాగతం పలికి కేసరపల్లికి తీసుకురానున్నారు. అనంతరం ఉదయం 11.27 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News June 12, 2024

కొల్లు రవీంద్ర రాజకీయ ప్రస్థానమిదే

image

* 2005లో రాజకీయ ప్రవేశం
* తొలుత TDP డివిజన్ అధ్యక్షుడు, 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు
* 2009లో మచిలీపట్నం నుంచి ఓటమి
* 2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక.. ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రిగా విధులు
* 2017లో న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువత, క్రీడల, నిరుద్యోగ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రిగా బాధ్యతలు
* 2019 ఎన్నికల్లో ఓటమి
* 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.. కేబినెట్‌లో చోటు

News June 12, 2024

నాలుగో సారి ముఖ్యమంత్రిగా..

image

AP: 28 ఏళ్లకే ఎమ్మెల్యే. 30 ఏళ్లకు మంత్రి. 45 ఏళ్లకు ముఖ్యమంత్రి. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇది. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు.. 13 ఏళ్ల 244 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నేడు నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆయనకు రాజధాని రూపంలో పెద్ద సవాల్ ముందుంది. దీంతో ఈసారి చంద్రబాబు పాలన మార్క్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

News June 12, 2024

రికార్డు సృష్టించిన పాక్ బౌలర్

image

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రౌఫ్ రికార్డు సృష్టించారు. 69 ఇన్నింగ్స్‌లో (71 మ్యాచులు) ఆయన ఈ ఘనతను అందుకున్నారు. కాగా స్పిన్నర్లు రషీద్ ఖాన్ 53 మ్యాచులు, హసరంగా 63 మ్యాచుల్లోనే ఈ ఫీట్ సాధించారు. నిన్న కెనడాతో జరిగిన మ్యాచులో రౌఫ్ 2 వికెట్లు పడగొట్టారు.

News June 12, 2024

పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు!

image

TG: టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును RTC ₹3 చొప్పున పెంచింది. కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌లో ₹10 నుంచి ₹13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ₹13 నుంచి ₹16కు, గరుడ ప్లస్‌లో ₹14 నుంచి ₹17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్‌‌లో ₹15 నుంచి ₹18కి, AC స్లీపర్‌లో ₹20 నుంచి ₹23కు పెంచింది.

News June 12, 2024

మనిషికి బర్డ్ ఫ్లూ.. భారత్‌లో రెండో కేసు

image

ప.బెంగాల్‌కు చెందిన ఓ 4ఏళ్ల బాలుడికి బర్డ్‌ ఫ్లూ సోకినట్లు WHO తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరిలో బాలుడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా, 3నెలల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. అతడు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, అధిక జ్వరం వంటి లక్షణాలతో బాధపడ్డాడని పేర్కొంది. అతని కుటుంబంలో ఇతరులకు ఈ వ్యాధి సోకలేదని చెప్పింది. మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకడం భారత్‌లో ఇది రెండోసారి కాగా, తొలి కేసు 2019లో నమోదైంది.