India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడుపై ఫోకస్ చేశారు. 6 నెలల్లోనే 10సార్లు పర్యటించారు. కానీ ఒక్క సీటూ దక్కలేదు. కేరళలోనూ ఇదే పరిస్థితి. ఆయన ప్రచారం చేసిన చోట BJP నేతలకు ఓటమే ఎదురైంది. గెలిచిన త్రిస్సూర్‌లో ఆయన ప్రచారం చేయకపోవడం గమనార్హం. UP, మహారాష్ట్రలోనూ BJP పరిస్థితి దిగజారింది. ఆఖరికి అయోధ్యలోనూ <<13388928>>ఓటమి<<>> తప్పలేదు. మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ మెజార్టీ 3 లక్షలకు పైగా తగ్గిపోయింది.

ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారం చేయగా, కేవలం 99 సీట్ల(53%)లోనే NDA అభ్యర్థులు గెలిచారు. కంచుకోటలైన దాదాపు 35 సీట్లను NDA కోల్పోయింది. ఈ 184 సీట్లలో 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 28 సీట్లు గెలవగా, ఈసారి 82 స్థానాలను సొంతం చేసుకుంది.

AP: ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదని, రాజకీయ పరిపాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. నా కోసం ఈ ఐదేళ్లు కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. ఎంపీలందరూ తరచూ వచ్చి నన్ను కలవండి. బిజీగా ఉన్నా మీతో మాట్లాడతా. ప్రతి అంశాన్ని నేనే వింటా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి’ అని ఎంపీలతో CBN వ్యాఖ్యానించారు.

18వ లోక్‌సభలో అడుగుపెట్టనున్న సీనియర్ మోస్ట్ MPల జాబితాలో కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్, INC నేత సురేశ్ కొడికున్నిల్ తొలిస్థానంలో నిలిచారు. వారు టికమ్‌గఢ్(మధ్యప్రదేశ్), మావెళిక్కర(కేరళ) నుంచి ఎనిమిదోసారి గెలిచారు. BJP నేతలు పంకజ్(మహారాజ్‌గంజ్), రమేశ్ చందప్ప(బీజాపూర్), ఫాగన్ సింగ్(మాల్దా), రాధామోహన్(పుర్వి చంపారన్), మన్‌సుఖ్‌భాయ్(భరూచ్), DMK నేత టీఆర్ బాలు(శ్రీపెరంబదూర్) ఏడోసారి ఎన్నికయ్యారు.

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలపై డబ్బులు పంపాలంటూ ఫోన్ పే నంబర్లు, లవ్ సింబల్స్, జై కాంగ్రెస్, జై కేసీఆర్ నినాదాలు కనిపించాయి. బ్యాలెట్ పేపర్‌లో కేవలం 1,2,3 నంబర్లతో వారి ప్రాధాన్యత ఓట్లు వేసేందుకే అనుమతి ఉంది. డిగ్రీలు చదివిన ఓటర్లు సైతం ఇలా తప్పుగా ఓటేయడం ఏంటని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

హీరోయిన్ కృతి శెట్టికి జోడీగా నటించడం తన వల్ల కాదని విజయ్ సేతుపతి అన్నారు. DSP సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటే తాను నటించనని దర్శకనిర్మాతలకు చెప్పానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఉప్పెన’లో కృతికి తండ్రిగా నటించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. అలాంటి అమ్మాయితో రొమాంటిక్ సీన్లు చేయలేనన్నారు. గతంలోనూ విజయ సేతుపతి ఈ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు మరికాసేపట్లో ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు కూడా హస్తినకు వెళ్తున్నారు. రేపు జరగబోయే ఎన్డీయే భేటీకి ఎంపీలతో కలిసి చంద్రబాబు హాజరు కానున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు సహాయం పొందుతారనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఫలితాలు దీనికి విరుద్ధంగా వచ్చాయి. ప్రజలు ఇంటర్నెట్‌ను తప్పుడు సమాచారం కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా తెగలోని యువకులు సోషల్ మీడియాకి అతుక్కుపోయి, పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయ్యారు. దీంతో తెగలో మనస్పర్ధలు మొదలయ్యాయి.

గోద్రేజ్ కన్స్యూమర్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ నిసాబా <<13156804>>గోద్రేజ్<<>> వీఐపీ ఇండస్ట్రీస్ స్వతంత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 3నుంచే తన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. నాయకత్వ బాధ్యతలు, వారసత్వ ప్రణాళికపై భిన్నాభిప్రాయాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఐపీ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా దిలీప్ పిరమల్ ఉన్నారు. దీని మార్కెట్ విలువ రూ.6,900 కోట్లుగా ఉంది.

AP: వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వాలంటీర్ ఉన్నత వర్గాలు తెలిపాయి. దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఫేక్ వార్తలను నమ్మకండని సూచించాయి. కాగా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకొని 1994 నుంచి 2003 వరకు వయోపరిమితిగా నిర్ణయించనున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.