news

News June 7, 2024

జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఎవరు?

image

AP: NDAలో భాగస్వామ్యం ఉన్న జనసేనకు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీలుగా గెలవగా, సీనియర్ అయిన బాలశౌరి పేరును జనసేనాని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అటు రాష్ట్రంలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. రాజమండ్రి నుంచి గెలిచిన పురందీశ్వరి, అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేశ్ పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలించనుంది.

News June 7, 2024

ఇరానీ TO రాజీవ్.. ఓడిన 13మంది కేంద్రమంత్రులు వీరే..

image

2024లో NDA కూటమికి చెందిన మంత్రుల్లో 13మంది ఓడిపోయారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతీ ఇరానీ, ఎలక్ట్రానిక్స్&ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా వంటి ప్రముఖులతో పాటు రావ్ సాహెబ్ దాన్వే, నాథ్ పాండే, సుభాష్ సర్కార్, కైలాశ్ చౌదరి, నిషిత్ ప్రమాణిక్, L మురుగన్, సంజీవ్ బల్యాన్, కపిల్ పాటిల్, భారతీ పవార్ వంటి మంత్రులు ఓడిపోయారు.

News June 7, 2024

టీడీపీ నుంచి ముగ్గురు.. మిగతా పార్టీల నుంచి 0

image

AP అసెంబ్లీలో ముగ్గురు మైనార్టీ MLAలు మాత్రమే ప్రాతినిధ్యం వహించనున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నసీర్ అహ్మద్, నంద్యాల నుంచి మహమ్మద్ ఫరూక్, మదనపల్లె నుంచి షాజహాన్ బాషా TDP టికెట్లపై గెలుపొందారు. ముగ్గురిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. అటు జనసేన, బీజేపీ నుంచి మైనార్టీలెవరికీ టికెట్లు కేటాయించలేదు. వైసీపీ టికెట్లు కేటాయించిన మైనార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి చెందారు.

News June 7, 2024

BREAKING: వడ్డీ రేట్లు యథాతథం

image

రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వడ్డీరేటు 6.5శాతంగా ఉంది. దాన్నే కంటిన్యూ చేస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు ఏడాదిగా వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతోంది.

News June 7, 2024

KCR అనుకున్నారు.. CBNకు సాధ్యమైంది!

image

కేంద్రంలో చక్రం తిప్పాలని BRS చీఫ్ KCR కలలు కన్నారు. కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో ఘనవిజయం సాధించిన TDP అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. బీజేపీకి సరిపడా ఆధిక్యం రాకపోవడంతో 16 సీట్లతో CBN కింగ్ మేకర్ అయ్యారు. ఆయన మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని NDA అధికారం చేపట్టబోతోంది.

News June 7, 2024

శివరాజ్‌ సింగ్‌కు BJP అధ్యక్ష బాధ్యతలు?

image

మధ్యప్రదేశ్ మాజీ CM శివరాజ్ సింగ్ చౌహాన్‌కు BJP జాతీయ అధ్యక్ష బాధ్యతలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ జేపీ నడ్డా నుంచి ఆయన పగ్గాలు అందుకోనున్నారట. ఇప్పటికే ఆయనకు ఢిల్లీ కార్యాలయం నుంచి పిలుపు కూడా వచ్చిందట. ఆయన ఆరుసార్లు ఎంపీగా, 16ఏళ్లు సీఎంగా పని చేశారు. ఇటీవల MP అసెంబ్లీ ఎన్నికల్లో BJP గెలిచినా ఆయనకు CM పదవి ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన చౌహాన్‌ వర్గం తాజా వార్తతో ఖుషీ అవుతోంది.

News June 7, 2024

ICICI బ్యాంక్‌‌కు SEBI మందలింపు

image

ICICI సెక్యూరిటీస్ షేర్‌హోల్డర్‌లు డీలిస్టింగ్‌కు అనుకూలంగా ఓటు వేసేలా ICICI బ్యాంకు ప్రయత్నించిందని SEBI మందలించింది. ICICI స్పందిస్తూ లావాదేవీల నిజానిజాలను మాత్రమే ఉద్యోగుల ద్వారా వాటాదార్లకు తెలియచేశామని సమాధానమిచ్చింది. దీనికి ప్రతిస్పందించిన SEBI లావాదేవీల్లో ICICI బ్యాంక్‌ కూడా ఒక భాగమని, వాటాదార్లను అలా సంప్రదించడం సరికాదంది. బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలంది.

News June 7, 2024

ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా <<13394190>>నీరభ్ కుమార్ <<>>ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావ‌ర‌ణ‌, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

News June 7, 2024

‘మనమే’ మూవీ పబ్లిక్ టాక్

image

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ‘మనమే’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్స్ పడటంతో సినిమాపై నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్, కృతిశెట్టి మధ్య ఫ్యామిలీ, లవ్ డ్రామా చాలా బాగుందని, కామెడీ సీన్లు బాగున్నాయని పోస్టులు పెడుతున్నారు. కొన్ని ఎమోషనల్ సీన్లు కనెక్ట్ కాలేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరికాసేపట్లో Way2News రివ్యూ

News June 7, 2024

సూపర్ ఓవర్ హీరో.. 14 ఏళ్ల తర్వాత PAKపై ప్రతీకారం

image

పాకిస్థాన్‌పై USA గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి ప్లేయర్ సౌరభ్ నేత్రావల్కర్‌ను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ICC U-19 ప్రపంచ కప్ 2010లో నేత్రావల్కర్ ఇండియా తరఫున ఆడి 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. అయితే, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు USA తరఫున ఆడి PAKను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు.