News June 7, 2024
ICICI బ్యాంక్‌కు SEBI మందలింపు

ICICI సెక్యూరిటీస్ షేర్‌హోల్డర్‌లు డీలిస్టింగ్‌కు అనుకూలంగా ఓటు వేసేలా ICICI బ్యాంకు ప్రయత్నించిందని SEBI మందలించింది. ICICI స్పందిస్తూ లావాదేవీల నిజానిజాలను మాత్రమే ఉద్యోగుల ద్వారా వాటాదార్లకు తెలియచేశామని సమాధానమిచ్చింది. దీనికి ప్రతిస్పందించిన SEBI లావాదేవీల్లో ICICI బ్యాంక్ కూడా ఒక భాగమని, వాటాదార్లను అలా సంప్రదించడం సరికాదంది. బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలంది.
Similar News
News July 10, 2025
లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
News July 10, 2025
అకౌంట్లలోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

AP: ‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున వేస్తోంది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.
News July 10, 2025
త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.