India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: జూన్ 8, శనివారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు అసర్: సాయంత్రం 4:51 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు ఇష: రాత్రి 8.11 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 8, శనివారం
జ్యేష్ఠమాసం, శు.విదియ: మ.03.55 గంటల వరకు
ఆరుద్ర: రాత్రి 07:42 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.05:34 నుంచి 07:19 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున గం.04.06 నుంచి 05.42 వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* ఈనెల 9న రాత్రి 7:15కి ప్రధానిగా మోదీ ప్రమాణం
* ఈ నెల 12న ఉ.11.27కి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
* మోదీ PMగా ఉన్నంత కాలం దేశం ఎవరికీ తలవంచదు: పవన్
* 3 రోజుల్లోనే APని హింసాయుత రాష్ట్రంగా మార్చారు: జగన్
* నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLCగా తీన్మార్ మల్లన్న
* ఢిల్లీకి TG సీఎం రేవంత్.. రేపు కాంగ్రెస్ పెద్దలతో భేటీ
* TGలో TETతో సంబంధం లేకుండానే టీచర్ల పదోన్నతులు
న్యూయార్క్‌లో ఈ నెల 9న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని ‘అక్యూ వెదర్’ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 (ఇండియాలో రా.8.30) గంటలకు 51 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు 45-50% వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
నెట్‌ఫ్లిక్స్ కో ఫౌండర్ మార్క్ రాండోల్ఫ్ తన తండ్రి చెప్పిన 8 సక్సెస్ రూల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అడిగిన దాని కంటే ఎక్కువగా పని చేయి. తెలియని విషయాలపై మాట్లాడొద్దు. ఎప్పుడూ ఫిర్యాదు చేయొద్దు. ఎలాంటి స్థితిలో ఉన్నా మర్యాదగా ప్రవర్తించు. ఓపెన్ మైండెడ్‌గా ఉంటూ అన్నింటినీ ఓ కంట కనిపెట్టు. దేనికైనా వెంటనే స్పందించు. అవసరమైతే లెక్కలు వేసుకో. కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకో’ అని పేర్కొన్నారు.
* స్మార్ట్ ఫోన్‌ను 4-5 రోజులకు ఒకసారైనా రీస్టార్ట్ చేయాలి.
* OSతో పాటు అన్ని యాప్స్ అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
* అపరిచిత Wi-Fi నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేసుకోవద్దు.
* అవసరం లేనప్పుడు బ్లూటూత్‌ను ఆఫ్‌లో ఉంచాలి.
* సోషల్ మీడియాలోని లింకులతో యాప్స్ డౌన్లోడ్ వద్దు.
* టెలిగ్రామ్‌లో వీడియోల కోసం సజెస్ట్ చేసే యాప్స్ డౌన్‌లోడ్ చేయవద్దు
* అనుమానాస్పద టెలిగ్రామ్ ఛానళ్లలో జాయిన్ కావొద్దు.
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు APలోని రాయలసీమ, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని పలు జిల్లాల్లో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ కంగ్రాట్స్ చెప్పారు. ‘పవన్‌తో భావోద్వేగ సంభాషణ జరిగింది. ఎన్నికల్లో ఘన విజయంపై హృదయపూర్వక అభినందనలు తెలియజేశా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్‌కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాజంపేట YCP మాజీ MLA మేడా మల్లికార్జునరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఫొటోలతో రెండు భారీ ఫ్లెక్సీలను కూడలిలో ఏర్పాటు చేశారు. ‘ఈ తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. అమరావతిని త్వరగా పూర్తి చేయాలి. పోలవరాన్ని నిర్మించాలి. రాజంపేటకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి’ అని రాసుకొచ్చారు. ఈసారి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వని విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.