News June 7, 2024
ఫ్లెక్సీలతో చంద్రబాబు, పవన్‌కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
AP: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాజంపేట YCP మాజీ MLA మేడా మల్లికార్జునరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఫొటోలతో రెండు భారీ ఫ్లెక్సీలను కూడలిలో ఏర్పాటు చేశారు. ‘ఈ తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. అమరావతిని త్వరగా పూర్తి చేయాలి. పోలవరాన్ని నిర్మించాలి. రాజంపేటకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి’ అని రాసుకొచ్చారు. ఈసారి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వని విషయం తెలిసిందే.
Similar News
News December 5, 2024
EWS కోటాలో కాపులకు సగం సరికాదు: హైకోర్టు
AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.
News December 5, 2024
ఈ 7 అలవాట్లు మీకు ఉన్నాయా?
జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని విషయాలను అలవర్చుకోవాలి. లేదంటే పురోగతి సాధించలేరు. నెగటివ్‌గా ఆలోచించేవారు వెంటనే దానిని వదిలించుకోవాలి. ఇతరులతో పోల్చుకుని నిరాశ పడకూడదు. గతాన్ని తలచుకుని వర్తమానాన్ని వదిలేస్తే ఎందుకూ పనికిరారు. సోమరితనాన్ని వదిలేస్తేనే లక్ష్యాల్ని సాధిస్తారు. ఒకరిపై అసూయ పడుతూ ఉంటే అక్కడే ఉండిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. భవిష్యత్ గురించి ఆందోళన పడకూడదు.
News December 5, 2024
ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే వెళ్లొద్దు: హైకోర్టు
AP: పుష్ప-2 టికెట్ ధరలను ఈ నెల 17 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే మూవీకి వెళ్లొద్దని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. సినిమా టికెట్లపై కాకుండా విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలతో వ్యాజ్యాలు వేయాలంది. ఈ పిల్‌పై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.