news

News March 22, 2024

ధోనీ ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: మాజీ క్రికెటర్

image

IPLలో CSK కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ధోనీ ఆటగాడిగా కూడా రిటైర్ అయితే బాగుండేది. MSD ప్లేయర్‌గా ఉన్న జట్టును కెప్టెన్‌గా ముందుకు నడిపించడం రుతురాజ్‌కు సాధ్యం కాదు. కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోనీ అంగీకరించవచ్చు. వద్దని చెప్పవచ్చు. ధోనీ గ్రౌండ్‌లో ఉంటే రుతురాజ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు’ అని చెప్పుకొచ్చారు.

News March 22, 2024

కాంగ్రెస్‌కు మరో షాక్

image

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. 2014-17 మధ్య తమ పార్టీ ఖాతాల్లోకి వచ్చిన డబ్బుపై పన్ను రికవరీ కోసం ఐటీ శాఖ తీసుకుంటోన్న చర్యలను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే పార్టీ అకౌంట్‌లోని రూ.105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వాడుకునే అవకాశం లేకపోవడంతో పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోందని కాంగ్రెస్ అగ్రనేతలు నిన్న వెల్లడించారు.

News March 22, 2024

ఆ బీచ్‌లో రాళ్లు ఎత్తుకెళ్తే భారీ ఫైన్!

image

స్పెయిన్‌లోని కానరీ దీవుల సమూహంలోని లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా‌లను సందర్శించే పర్యాటకులకు అధికారులు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడి ఇసుక, రాళ్లను తీసుకెళ్తున్నారట. ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సందర్శకులకు రూ.2లక్షల వరకు ఫైన్ విధించేస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.

News March 22, 2024

బెదిరింపులకు లొంగకపోవడంతోనే కేజ్రీవాల్ అరెస్ట్: కూనంనేని

image

TG: దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి BJP ప్రయత్నిస్తోందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. PM మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. BJP బెదిరింపులకు లొంగకపోవడంతోనే ఢిల్లీ CM కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఫైరయ్యారు. ఎన్నికల బాండ్ల ద్వారా BJPకి రూ.వేల కోట్లు వచ్చాయని, దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

News March 22, 2024

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరాం: చంద్రబాబు

image

AP: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్ర సమస్యలపై పోరాడే నేతలనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పారు. వారిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన 5 MLA, 4 MP స్థానాలకు క్యాండిడేట్లను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.

News March 22, 2024

విపరీతమైన ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

✒ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
✒ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✒ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✒ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.

News March 22, 2024

గత IPLలోనే ధోనీ నాకు హింట్ ఇచ్చారు: గైక్వాడ్

image

తనకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత సంవత్సరమే మహీ భాయ్ నాకు కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చారు. సిద్ధంగా ఉండు.. నీకిది సర్‌ప్రైజ్‌గా ఉండకూడదు అని చెప్పారు. నేను క్యాంప్‌లో జాయిన్ అయినప్పుడు మ్యాచ్ ప్రణాళికలపై సూచనలు చేశారు. కెప్టెన్ చేయాలని ఆయన ముందే అనుకున్నారు. కానీ, ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారం క్రితం నాతో చెప్పారు’ అని తెలిపారు.

News March 22, 2024

ఒత్తిడితో సమస్యలు ఇంతింత కాదయా..

image

ఈ డిజిటల్ యుగంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒత్తిడి. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యలతో తరచూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఫిజికల్, మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, అలసట, అజీర్తి, BP, షార్ట్ టెంపర్, వాయిదా వేయడం, నిర్లక్ష్యం ఆవహించడం వంటి సమస్యలు చుట్టుముడతాయట. ప్రెజర్ మేనేజ్‌మెంట్ చేసుకోలేకపోతే ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా వేధిస్తాయంటున్నారు.

News March 22, 2024

తప్పుడు ఆరోపణలపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు: సజ్జల

image

AP: విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘డ్రగ్స్ దిగుమతి కచ్చితంగా టీడీపీ గ్యాంగ్ పనే అని మాకు అనుమానం ఉంది. ఆ పార్టీ నాయకులకే నిందితులతో సంబంధాలున్నాయి. ఈ కేసులో ఎవరున్నారో తెలియాల్సిందే. తప్పించుకోవడానికి మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

News March 22, 2024

BREAKING: బీజేపీ నాలుగో జాబితా విడుదల

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. 15 మందితో నాలుగో లిస్టును రిలీజ్ చేయగా.. అందులో 14 తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి స్థానాలున్నాయి. నటి రాధికాశరత్ కుమార్ విరుధునగర్ నుంచి పోటీ చేయనున్నారు.

error: Content is protected !!