news

News March 21, 2024

ధోనీ మరో ఐదేళ్లు ఆడాలి: రైనా

image

సీఎస్కే కెప్టెన్ ధోనీ కనీసం మరో ఐదేళ్లు ఆడాలని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ‘ధోనీకి ఇప్పుడు 42ఏళ్లు. కానీ తన ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన మరో ఐదేళ్లు, కాదంటే కనీసం రెండుమూడేళ్లు ఆడాలి. తర్వాతి కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఈ సీజన్ సీఎస్కేకు అత్యంత కీలకం. ధోనీ కన్ను ఎవరి మీద పడుతుందో చూడాలి. కెప్టెన్సీకి రుతురాజ్ ఒక మంచి ఆప్షన్’ అని రైనా పేర్కొన్నారు.

News March 21, 2024

సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా పద్మారావు?

image

TG: సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీసీకే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిని పోటీ చేయించాలని ప్రయత్నించగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో పద్మారావును అభ్యర్థిగా నిర్ణయించినట్లు టాక్.

News March 21, 2024

సచివాలయంలోకి ప్రజలకు నో ఎంట్రీ

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుకు ఈసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీంతో పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలు, సందర్శకులను సచివాలయంలోకి అనుమతించడం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప సెక్రటేరియట్‌లోకి అనుమతిపై ఆంక్షలు విధించారు. మరోవైపు కోడ్ రాకతో పోలీస్, ఈసీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలించే నగదును పట్టుకుని సీజ్ చేస్తున్నారు.

News March 21, 2024

బెస్ట్ ఓపెనింగ్ జోడీ ఏది?

image

ఐపీఎల్ 2024 ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. మార్చి 22న సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సంగ్రామానికి తెరలేవనుంది. ఈ క్రమంలో ఆయా జట్ల బలాబలాలపై చర్చ జరుగుతోంది. టీ20 ఫార్మాట్ కావడంతో ప్రతి జట్టుకూ ఓపెనర్లే కీలకం. పవర్ ప్లేలో వారు చేసే పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయి. మరి ఈ సీజన్‌లో ఏ జట్టు ఓపెనింగ్ పెయిర్ బలంగా ఉంది? కామెంట్ చేయండి..

News March 21, 2024

ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా సుబియాంటో

image

ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో పదవీ కాలం ముగియడంతో సుబియాంటో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. కాగా సుబియాంటోకు 58.6 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి అనీస్ బస్వేదర్‌కు 24.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. గత నెల 14న ఎన్నికలు జరగగా ఇప్పుడు ఫలితాలు వెల్లడయ్యాయి.

News March 21, 2024

మూడేళ్లు ఆగితేనే మూడు ముళ్లు.. ఎక్కడో తెలుసా?

image

పెళ్లిళ్లు అన్ని చోట్ల ఒకేలా జరగవు. వేర్వేరు చోట్ల వేర్వేరు సంప్రదాయాలు ఉంటాయి. శ్రీకాకుళంలోని నువ్వుల రేవు గ్రామంలో పెళ్లి జరగాలంటే యువతీ, యువకులు మూడేళ్లు ఆగాల్సిందే. ఒకేసారి ఇక్కడ సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ఇక్కడ అబ్బాయికి అమ్మాయి తాళి కట్టే వింత ఆచారం ఉంది. నల్ల కళ్లద్దాలు, డబ్బులతో వధూవరులను అలంకరిస్తారు. ఆ సమయంలో ఊరిలో పండగ వాతావరణం నెలకొంటుంది. వేరే ఊరి వారిని ప్రేమించడం ఇక్కడ నిషేధం.

News March 21, 2024

IPL: LSGకి బిగ్ షాక్

image

రేపు ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుండగా లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. కొద్ది రోజులు కుటుంబంతో గడిపిన అనంతరం ఆయన ఐపీఎల్‌లో ఆడనున్నారు. కాగా ఇప్పటికే మార్క్ వుడ్ కూడా ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి గైర్హాజరీతో లక్నో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

News March 21, 2024

రామ్ చరణ్ ఇంట్లో జాన్వీ కపూర్ సందడి

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సందడి చేశారు. ఆమెతోపాటు బోనీ కపూర్, సుకుమార్, బుచ్చిబాబు కూడా చెర్రీ నివాసంలో కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రామ్ చరణ్, జాన్వీ జంటగా ‘RC16’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

News March 21, 2024

ఆ వీడియోల గుర్తింపు యూట్యూబ్‌లో ఇక సులువు

image

AI పుణ్యమా అని ఏది అసలు వీడియోనో.. ఏది ఆర్టిఫిషియల్ వీడియోనో గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యూజర్లు అసలైన కంటెంట్, ఏఐతో రూపొందించిన వీడియోకు మధ్య వ్యత్యాసాన్ని తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏఐ ద్వారా ఏమైనా క్రియేట్ చేస్తే ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తులు వెల్లడించాలి. దీని కోసమే క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్ తీసుకొచ్చామంది.

News March 21, 2024

మహ్మద్ షమీ కొత్త అవతారం

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కొత్త అవతారం ఎత్తనున్నారు. క్రిక్‌బజ్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌‌లో షమీ చోటు దక్కించుకున్నారు. క్రిక్‌బజ్ నిర్వహించే చర్చల్లో ఆయన విశ్లేషకులుగా ఉండనున్నారు. మాజీ క్రికెటర్లు, కామేంటేటర్లతో కలిసి ఆయన చర్చించనున్నారు. కాగా షమీ కాలి చీలమండ గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఆయన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

error: Content is protected !!