News June 7, 2024

రోహిత్ శర్మ చేసే హార్డ్‌వర్క్ చాలా మంది చేయలేరు: అభిషేక్ నాయర్

image

2011 WCకి సెలక్ట్ అవ్వకపోవడం రోహిత్ శర్మలో చాలా మార్పు తీసుకొచ్చిందని మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్నారు. ‘రోహిత్‌ను గిఫ్టెడ్ ప్లేయర్ అని అంటుంటారు. కానీ అతడు చేసే హార్డ్‌వర్క్ చాలా మంది చేయలేరు. 2011 WCకి ఎంపిక కానప్పుడు “నేను చాలా కష్టపడాలి. ప్రజలు కొత్త రోహిత్ శర్మ గురించి చెప్పుకోవాలి” అని అతడు నాతో అన్నారు. ఆ తర్వాత హిట్‌మ్యాన్‌గా మారారు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Similar News

News February 15, 2025

అలాంటి కథలతో సినిమాలు తీయాలి: మంత్రి సత్యకుమార్

image

AP: సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతమైన సినిమాలు తీయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వీరప్పన్, పూలన్ దేవి లాంటి బందిపోట్లు, స్మగ్లర్ల జీవితకథలతో సినిమాలు తీయడమేంటని ప్రశ్నించారు. వీటితో చిన్నారులను స్మగ్లర్లుగా మార్చమని సందేశమిస్తున్నారా అని అన్నారు. జన్మించిన ఊరు కోసం, సమాజం కోసం మంచి చేసే వారి కథలు సినిమాలుగా తీయాలని సూచించారు.

News February 15, 2025

WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ 164 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్ స్కివర్ బ్రంట్(80*) అదరగొట్టగా కెప్టెన్ హర్మన్ ప్రీత్(42) ఫర్వాలేదనిపించారు. యస్తికా(11) మినహా ఇతర ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్నాబెల్ 3, శిఖా పాండే 2, కాప్సే, మిన్నూ చెరో వికెట్ వికెట్ తీశారు. DELHI టార్గెట్ 165.

News February 15, 2025

PHOTO: మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే!

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వగా పాటల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా సెట్‌లో ధోతీలో ఉన్న చిరంజీవి బ్యాక్ ఫొటోను దర్శకుడు పంచుకున్నారు. కీరవాణి కంపోజిషన్‌లో చిరు స్టెప్పులతో అదరగొట్టారని రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!