news

News March 20, 2024

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని అన్నారు. ‘చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రలా నిలబడ్డాయి. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారు. బాబుది అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అనే నైజం. ఈ మూడు పార్టీల పొత్తు ముందే ఊహించాం’ అని దుయ్యబట్టారు.

News March 20, 2024

ఆ వ్యాఖ్యలను పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

image

AP: చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మాఫియాలతో పొత్తులేకుండా పెద్దిరెడ్డి ఎన్నికల్లో నిలబడాలన్నారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు. టీడీపీ పొత్తులు బహిరంగమేనని.. జగన్‌వి చీకటి పొత్తులని విమర్శించారు. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.

News March 20, 2024

అయోధ్య రామయ్య సేవలో ప్రియాంక చోప్రా

image

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.

News March 20, 2024

5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

TG: వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపీఎం, డీఎంఈ, వైద్యవిధాన పరిషత్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

News March 20, 2024

ఇంజెక్షన్లు ప్రాణాల మీదకు తెచ్చాయి!

image

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అలీసియా హల్లోక్ బోటాక్స్ ఇంజెక్షన్లు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందేందుకు ఆమె ఈ ఇంజెక్షన్లు తీసుకోగా అవి వికటించి పక్షవాతం బారిన పడేలా చేశాయి. అంతేకాదు కంటిచూపు మందగించడం, మాట్లాడలేకపోవడం, ఆహారాన్ని తీసుకోలేకపోవడం మొదలైన సమస్యలు కూడా వచ్చాయట. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె తాను ఇక బతకనేమోనని అనుకున్నానని వాపోయారు.

News March 20, 2024

నా ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు: పొన్నం

image

TG: హనుమకొండ ఆర్డీవో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనపై సీఎస్‌ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

News March 20, 2024

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్!

image

చదువు కోసం USలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లిన అబ్దుల్ మహ్మద్ అనే హైదరాబాద్ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాకి చెందిన కొందరు అబ్దుల్‌ను కిడ్నాప్ చేశారని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గతవారం అబ్దుల్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చిందట. $1200 (రూ.99,750) ఇవ్వాలని లేదంటే బాధితుడి కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సమాచారం. దీనిపై అక్కడున్న అబ్దుల్ బంధువులు పోలీసులను ఆశ్రయించారు.

News March 20, 2024

SRH కెప్టెన్సీ మార్పుతో షాకయ్యా: అశ్విన్

image

SA20లో సన్‌రైజర్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపారు కెప్టెన్ మార్క్రమ్. అలాంటి ఆటగాడిని ఐపీఎల్‌లో SRH కెప్టెన్‌గా తప్పించడం షాక్ గురిచేసిందని భారత బౌలర్ అశ్విన్ అన్నారు. ‘మళ్లీ మార్క్రమ్‌నే కొనసాగిస్తారని నేను భావించా. అలాంటిది వాళ్లు కెప్టెన్‌ను మార్చడం నాకు షాకింగ్‌గా అనిపించింది. కమిన్స్‌ను కెప్టెన్‌ చేయడం కచ్చితంగా సన్‌రైజర్స్‌ తుది జట్టు కూర్పును ఇబ్బంది పెడుతుంది’ అని స్పష్టం చేశారు.

News March 20, 2024

పవన్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురంలో నేనే పోటీ చేస్తా: వర్మ

image

AP: అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉంటారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ స్పందించారు. ‘పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం కృషి చేస్తా. ఒకవేళ ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో నేనే బరిలో ఉంటా’ అని తెలిపారు.

News March 20, 2024

‘ఇళయరాజా’ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

image

మ్యూజిక్ మాస్ట్రో ‘ఇళయరాజా’ బయోపిక్ షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండగా, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ టీమ్ విడుదల చేసిన ఇంట్రడక్షన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

error: Content is protected !!