News June 7, 2024

సెన్సెక్స్ ALL TIME HIGH

image

కౌంటింగ్ రోజున దారుణ నష్టాలను చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 3 రోజులు పైకెగిశాయి. ఇవాళ సెన్సెక్స్ ఒకదశలో 1,620 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 76,795కు చేరింది. చివరకు 76,694 వద్ద ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగసి 23,267 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్లు లాభపడ్డారు. రెపో రేట్లలో <<13395338>>RBI<<>> మార్పులు చేయకపోవడం, మోదీ 3.Oకు చేరువవడం మార్కెట్లకు కలిసి వచ్చినట్లు నిపుణుల అంచనా.

Similar News

News December 10, 2024

BREAKING: మోహన్ బాబుకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

image

TG: సినీ నటుడు మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. మరో కుమారుడు మంచు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా తన ఇంట్లో ఇవాళ సాయంత్రం నుంచి జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ఆయన టెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 10, 2024

మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

image

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గు చేటు, అమానుషమని అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు. మరోవైపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.