news

News March 19, 2024

ఆరోజు రాత్రి గంటపాటు లైట్లు ఆర్పండి

image

ఈనెల 23న దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌లో భాగంగా గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు.

News March 19, 2024

అసంతృప్తులను బుజ్జగించే పనిలో పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. దీంతో పాటు పెండింగ్ స్థానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తిరుపతి సీటు వివాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

News March 19, 2024

అనుష్క సినిమాకు టైటిల్ ఫిక్స్

image

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి.. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఆమె తెలుగులో ఓ మూవీ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

News March 19, 2024

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి ఊరట

image

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022లో అధికారం కోల్పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆయన లాంగ్ మార్చ్ నిర్వహించారు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన విధ్వంసానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారించిన ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు ఆయనను తాజాగా నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

News March 19, 2024

వాట్సాప్‌.. త్వరలో 60 సెకన్ల స్టేటస్ ఫీచర్‌

image

యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 30 సెకన్ల వీడియోను స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండగా, దాన్ని 60 సెకన్లకు పెంచనుంది. అలాగే UPI ద్వారా వేగంగా చెల్లింపు చేసేందుకు మరో ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యాప్‌లో త్రిడాట్స్‌పై సెలక్ట్ చేసి, ఆ తర్వాత QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంది. ఇకపై నేరుగా QR కోడ్‌ను స్కాన్ చేసేలా షార్ట్ కట్ ఆప్షన్ ఇవ్వనుంది.

News March 19, 2024

స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుని చేర్చిన సీఐడీ

image

AP: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అచ్చెన్నాయుడిని సీఐడీ ఏ38గా చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ని రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కి వాయిదా వేసింది.

News March 19, 2024

హోం లోన్ తీసుకునే వారికి GOOD NEWS

image

గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ప్రకటించింది. 8.45%గా ఉన్న వడ్డీ రేటులో 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక నుంచి తమ బ్యాంకులో హోంలోన్ వడ్డీ రేటు 8.3% నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని BOI పేర్కొంది.

News March 19, 2024

కాకినాడ నుంచే ఎందుకు?

image

AP: కాకినాడ లోక్‌సభ స్థానంలో జనసేన తరఫున ఉదయ్ బరిలోకి దిగుతున్నారు. కాగా ఈ పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. గతంలో ఇక్కడ అత్యధిక సార్లు కాపు అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 1,32,648, TDPకి 5,11,892 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం YCP అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు.

News March 19, 2024

RCB కొత్త జెర్సీ ఇదే

image

IPL-2024 కోసం ఆర్సీబీ కొత్త జెర్సీని రివీల్ చేసింది. అన్‌బాక్స్ ఈవెంట్‌లో భాగంగా కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనిపించారు. అలాగే కొత్త లోగోను రిలీజ్ చేశారు. పాత పేరు Royal Challengers BANGALORE స్థానంలో స్వల్ప మార్పు చేసి Royal Challengers BENGALURUగా మార్చారు.

News March 19, 2024

BREAKING: ఎమ్మెల్సీ కవిత కేసులో బిగ్ ట్విస్ట్

image

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు. ఇటీవల కవితకు నాగ్‌పాల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!