News June 7, 2024

కొత్త లోగోలతో రానున్న Royal Enfield బైక్స్?

image

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ తన లోగోలను మార్చేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో రెండు రకాల బ్రాండ్ లోగోల ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. ఒకటి ఓల్డ్-స్కూల్ డిజైన్‌ కాగా మరొకటి స్టైలిష్ వెర్షన్‌లో ఉండనుంది. వీటిల్లో ఓల్డ్-స్కూల్ లోగోను బైక్ ట్యాంక్‌పై, స్టైలిష్ లోగోను ఇతర భాగాలపై చూడొచ్చని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Similar News

News October 8, 2024

పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల

image

AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

News October 8, 2024

పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

News October 8, 2024

YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు

image

TGలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో నేడు APలోని మన్యం, అల్లూరి, ఉ.గో, రాయలసీమ, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని APSDMA పేర్కొంది.