India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినందుకు బాలయ్యను డైరెక్టర్లు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ కలిసి అభినందించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ డైరెక్షన్‌లో వీరసింహారెడ్డి, అనిల్ దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రాల్లో ఆయన నటించారు.
TG: ఎన్నికల కోడ్ వల్ల కాళేశ్వరంపై ఇన్నాళ్లూ సమీక్షలు చేయలేదని, ఇకపై మరమ్మతులు వేగవంతం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన సుందిళ్ల బ్యారేజీ వద్ద పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన రూ.94వేల కోట్ల అప్పునకు వడ్డీ కడుతున్నాం. BRS హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పగుళ్లతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది’ అని పేర్కొన్నారు.
AP: మాజీ CM జగన్ వైఖరి వల్లే ఎన్నికల్లో YCP ఘోరంగా ఓడిపోయిందని TDP నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ చేసిన అరాచకాలే ఆ పార్టీని నాశనం చేశాయని చెప్పారు. ‘బటన్లు నొక్కినంత మాత్రాన మీరు చేసిన నేరాలు-ఘోరాలు ప్రజలు మర్చిపోరు. YCP పాలనలో దళితులపై దాడులు, అరాచకాలు పెరిగిపోయాయి. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారు’ అని ఆయన జగన్‌పై మండిపడ్డారు.
TG: కాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని GHMC హెచ్చరించింది. అత్యవసరం అయితే 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌తో పాటు నగరంలోని మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబం మొత్తం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ తెలిపారు. ‘గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని కౌర్ ట్వీట్ చేశారు.
కౌంటింగ్ రోజున దారుణ నష్టాలను చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 3 రోజులు పైకెగిశాయి. ఇవాళ సెన్సెక్స్ ఒకదశలో 1,620 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 76,795కు చేరింది. చివరకు 76,694 వద్ద ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగసి 23,267 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్లు లాభపడ్డారు. రెపో రేట్లలో <<13395338>>RBI<<>> మార్పులు చేయకపోవడం, మోదీ 3.Oకు చేరువవడం మార్కెట్లకు కలిసి వచ్చినట్లు నిపుణుల అంచనా.
టీ20 వరల్డ్‌కప్‌లో తమపై వివక్ష చూపుతున్నారని శ్రీలంక క్రికెట్ ICCకి ఫిర్యాదు చేసింది. సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఒక్కో జట్టును ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించింది. 4 మ్యాచ్‌లు 4 వేదికల్లో ఉండటం వల్ల ప్రయాణానికే సమయం సరిపోతోందని వాపోయింది. హోటల్ దూరంగా ఉండడంతో ప్రాక్టీస్ గ్రౌండ్‌కు వెళ్లలేకపోతున్నామని పేర్కొంది. తమకు న్యాయం చేయాలని కోరింది.
AP: ఉపాధ్యాయ బదిలీల కోసం తాను లంచాలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం, అగత్యం తనకు లేదన్నారు. ‘టీచర్ల బదిలీలు నిలిపేయాల్సిందిగా నేనే అధికారులకు విజ్ఞప్తి చేశా. బదిలీల్లో అవకతవకలు జరిగాయనేది అవాస్తవం. కొత్త ప్రభుత్వం టీచర్ల బదిలీలపై నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ఎన్నికైన TDP ఎంపీలతో చంద్రబాబు ఢిల్లీలో ఫొటో దిగారు. అందులో పెమ్మసాని (GNT), అప్పలనాయుడు (VZM), వేమిరెడ్డి (నెల్లూరు), మహేశ్ యాదవ్ (ఏలూరు), ప్రసాదరావు (చిత్తూరు), మాగుంట (ఒంగోలు), నాగరాజు (కర్నూలు), శబరి (నంద్యాల), లక్ష్మీనారాయణ (ATP), పార్థసారథి (హిందూపురం), రామ్మోహన్(SKLM), హరీశ్ (అమలాపురం), కేశినేని చిన్ని (విజయవాడ), కృష్ణప్రసాద్ (బాపట్ల), కృష్ణదేవరాయలు (NRT), భరత్ (విశాఖ) ఉన్నారు.
AP:అఖండ మెజార్టీతో విజయం సాధించిన NDA కూటమి గత ప్రభుత్వంలో నియమించబడిన వాలంటీర్ల విషయంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ₹10వేల వేతనం ఇస్తామని కూటమి నేతలు ప్రచారం చేశారు. రాజీనామా చేసిన వారు పోను 2లక్షల మంది వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తారా? కొత్తగా నియమిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.