news

News June 7, 2024

ఈనెల 14న ‘కన్నప్ప’ టీజర్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న‘కన్నప్ప’ సినిమా టీజర్ ఈనెల 14న రిలీజ్ కానుంది. కేన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని, దీనిని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా తన హృదయంలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

News June 7, 2024

సీఎంవోలోని పూనం, ముత్యాలరాజు, గుప్తాల బదిలీ

image

AP: ఏపీ సీఎం పేషీలోని ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ్ భరత్ గుప్తాలను బదిలీ చేసింది. ఈ ముగ్గురు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎంవోలో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 7, 2024

4 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు.. భారీ వర్ష సూచన

image

TG: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అవి నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News June 7, 2024

వన్డే చరిత్రలో స్లోయెస్ట్ ఇన్నింగ్స్.. 174 బంతుల్లో 36 రన్స్!

image

వన్డే చరిత్రలో స్లోయెస్ట్ ఇన్నింగ్స్ సరిగ్గా ఇదే రోజు 1975లో నమోదైంది. ENGపై గెలిచేందుకు 335 రన్స్ చేయాల్సి ఉండగా.. సునీల్ గవాస్కర్ టెస్ట్ తరహాలో ఆడారు. 174 బంతుల్లో ఒక్క ఫోర్ కొట్టి కేవలం 36 పరుగులు చేశారు. దీంతో భారత్ 60 ఓవర్లలో 133/2 రన్స్ మాత్రమే చేయడంతో ENG 202 పరుగుల తేడాతో గెలిచింది. గవాస్కర్ ఇన్నింగ్స్‌ కోపం తెప్పించడంతో కొందరు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చారు.

News June 7, 2024

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు MLA కీలక నిర్ణయం!

image

TG: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ సిద్ధమయ్యారు. ‘ఫోన్ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకోవచ్చు. నీటి ఎద్దడి, మురుగు నీటి కాలువలు, రోడ్డు, విద్యుత్, మిషన్ భగీరథ సమస్యల, పోడు భూముల గురించి కాల్స్ వచ్చినట్లు ఆయన Xలో పోస్ట్ చేశారు.

News June 7, 2024

పాలన ఎలా చేయాలో సీఎం రేవంత్ నేర్చుకోవాలి: మోత్కుపల్లి

image

TG: రేవంత్ CM అవుతారని తొలుత చెప్పిన తననే ఆయన మొదటగా రోడ్డున పడేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. 6గంటలు సెక్రటేరియట్‌లో కూర్చున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ‘6సార్లు గెలిచిన నాకు ఇంత అవమానం ఎక్కడా జరగలేదు. పాలన ఎలా చేయాలో రేవంత్ నేర్చుకోవాలి. APలో అహంకారంతో జగన్ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. CBN ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు’ అని పేర్కొన్నారు.

News June 7, 2024

జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి.. కోర్టును కోరిన MLC కవిత

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. కవితకు ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి కవిత 9 పుస్తకాలు కోరగా ఆ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.

News June 7, 2024

మరో మూడు రోజుల్లో ‘కల్కి’ ట్రైలర్‌

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో ట్రైలర్ రాబోతోందని ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆయుధంతో ఉన్నారు. ఈనెల 27న ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

News June 7, 2024

పసికూనే.. అయినా పంజా విసురుతోంది!

image

ఏమాత్రం అంచనాల్లేని అమెరికా టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం గాలి వాటం కాదని నిరూపిస్తూ.. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో ఏకంగా మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌కు షాకిచ్చి ప్రపంచకప్‌లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న అమెరికా ప్లేయర్లు పెద్ద జట్లకే సవాల్ విసురుతున్నారు.

News June 7, 2024

ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ

image

ఎన్డీఏ అంటే న్యూ ఇండియా.. డెవలప్ ఇండియా.. యాస్పిరేషనల్ ఇండియా అని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అందరి కర్తవ్యమని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పిలుపునిచ్చారు. దేశ ప్రజల స్వప్నాల సాకారానికి తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు. ఇండియాగా పేరు మార్చుకున్న తర్వాత కూడా యూపీఏను ప్రజలు అంగీకరించలేదని మోదీ విమర్శించారు.