news

News June 6, 2024

కాసేపట్లో TDP ఎంపీలతో చంద్రబాబు భేటీ

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో నూతనంగా ఎన్నికైన తమ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈమేరకు ఉండవల్లిలోని తన నివాసానికి ఎంపీలను ఆహ్వానించారు. రేపు ఎన్డీయే భేటీలో ఎంపీలతో కలిసి పాల్గొననున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి సైతం టీడీపీ ఎంపీలు హాజరు కానున్నారు.

News June 6, 2024

ఉపాసన తాతకు కారు ప్రమాదం

image

అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. చెన్నైలో ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి కారుపైకి దూసుకురాగా ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై చెన్నైలో కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రామ్ చరణ్ భార్య ఉపాసనకు ప్రతాప్ రెడ్డి తాత అవుతారు. ప్రస్తుతం ఉపాసన అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

News June 6, 2024

ఇప్పటికైనా సుగాలి ప్రీతి కేసు పరిష్కారం అవుతుందా?: పూనమ్

image

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్య కేసు పరిష్కారం కోసం ఎదురుచూస్తోన్న ఆమె తల్లికి న్యాయం చేయాలని నటి పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ కేసు త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. 2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించగా.. అత్యాచారం చేసి, హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గత ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది.

News June 6, 2024

BREAKING: వైఎస్ జగన్ కీలక భేటీ

image

AP: ఎన్నికల్లో ఘోర ఓటమిపై వైఎస్ జగన్ పోస్ట్‌మార్టం మొదలుపెట్టారు. తాడేపల్లిలోని నివాసంలో ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో పాటు ఓడిన నేతలతోనూ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలు, ఓట్లు తగ్గడంపై వారితో చర్చిస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్ సహా పలువురు ఓటమికి గల కారణాలను జగన్‌కు వివరించారు.

News June 6, 2024

ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్?

image

AP: అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి ఉంది.

News June 6, 2024

T20WC: ఒమన్‌పై ఆస్ట్రేలియా గెలుపు

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. ఛేదనలో ఒమన్ జట్టు 125/9కే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 39 రన్స్ తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగిన ఒమన్ ప్రత్యర్థి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది.

News June 6, 2024

బాబును కలిసేందుకు వారికి నో పర్మిషన్

image

AP సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబును కలిసేందుకు పలువురు IAS, IPS ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించిన DIG కొల్లి రఘురామిరెడ్డి, జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన PSR ఆంజనేయులుకు CBNను కలిసేందుకు అధికారులు అనుమతించలేదు. అటు రఘురామిరెడ్డిని అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

News June 6, 2024

2024లో ఎన్నికైన ధనిక MPలు వీరే!

image

లోక్‌సభ ఎన్నికల్లో టాప్-10 రిచెస్ట్ అభ్యర్థుల్లో నలుగురు మాత్రమే ఎన్నికయ్యారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో అత్యంత ధనిక ఎంపీగా నిలిచారు. ఆయన తర్వాత బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి (రూ.4,568 కోట్లు), కురుక్షేత్ర (హరియాణా) నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ (రూ.1,230 కోట్లు), నెల్లూరు టీడీపీ MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(రూ.716 కోట్లు) ఉన్నారు.

News June 6, 2024

బీజేపీ అగ్రనేతల సమావేశం

image

ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ సహా పలువురు భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కేబినెట్ కూర్పు, మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపు సహా పలు అంశాలపై వీరంతా చర్చిస్తున్నారు. ఈ నెల 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆయా అంశాలను ఈలోగా కొలిక్కి తెచ్చేలా కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు.

News June 6, 2024

కంగన గెలుపుపై లేడీ కమెడియన్ సెటైర్

image

నటి కంగన MPగా గెలవడంపై లేడీ కమెడియన్ సోనాలి థాకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘రాబోయే 4 ఏళ్లు హిమాచల్‌లో హృతిక్ రోషన్ సినిమా షూటింగ్‌లు జరగవేమో’ అని సెటైర్ వేశారు. తాను హృతిక్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని కంగనా గతంలో చెప్పగా, దాన్ని హృతిక్ కొట్టిపారేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. దాన్ని ఉద్దేశిస్తూ తాజాగా సోనాలి జోక్స్ వేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో BJP నుంచి కంగన పోటీ చేశారు.