News June 6, 2024
ఇప్పటికైనా సుగాలి ప్రీతి కేసు పరిష్కారం అవుతుందా?: పూనమ్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్య కేసు పరిష్కారం కోసం ఎదురుచూస్తోన్న ఆమె తల్లికి న్యాయం చేయాలని నటి పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ కేసు త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. 2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించగా.. అత్యాచారం చేసి, హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గత ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది.
Similar News
News December 7, 2024
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
AP: తమ హయాంలో 11 DSCల ద్వారా 1.50 లక్షల మంది టీచర్లను నియమించామని CM చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసేవాళ్లమన్నారు. ఇకపై ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేశ్ చర్యలు తీసుకుంటారన్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSCపై CM తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.
News December 7, 2024
మిస్టీరియస్ వ్యాధి.. 143 మంది మృతి
DR కాంగో దేశంలో మిస్టీరియస్ వ్యాధి కలకలం రేపుతోంది. చికిత్స లేని ఈ రోగం బారినపడి నవంబర్‌లో 143 మంది మరణించారు. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, అనీమియా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో WHO హై అలర్ట్ ప్రకటించింది. అక్కడికి స్పెషల్ టీమ్‌ను పంపింది. ‘మేం ఏ వ్యాధితో పోరాడుతున్నామో అర్థం కావట్లేదు. అది వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది తెలియదు’ అని అధికారులు తెలిపారు.
News December 7, 2024
EVMలపై డౌట్: ప్రమాణం చేయని MVA MLAs
మహారాష్ట్రలో EVMల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ MVA MLAలు నేటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ‘గెలుపొందిన మా MLAలు నేడు ప్రమాణం చేయరు. మాకు EVMలపై అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూనీ అయింది’ అని శివసేన UBT అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఫలితాలపై సందేహాలొస్తున్నాయి. మొత్తం ప్రక్రియ కళంకితమైంది. ఏదో తప్పు జరిగినట్టు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు’ అని కాంగ్రెస్ MLA విజయ్ తెలిపారు.