India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్: రోహిత్ (C), కోహ్లీ, పంత్, సూర్య, శివమ్ దూబే, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బుమ్రా, అర్ష్‌దీప్.
ఐర్లాండ్: ఆండీ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (C), టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, మెక్‌కార్తీ, బెన్ వైట్, జోష్ లిటిల్.
ఎల్లుండి మరోసారి భేటీ కావాలని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు హాజరుకానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత ఈ మీటింగ్ ఉండనుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీయే నేతలు ఎల్లుండి రాష్ట్రపతిని కోరనున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకారం, 10 లేదా 11న చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉంది.
AP: కూటమి ప్రభంజనంలోనూ కొందరిని దురదృష్టం వెంటాడింది. ఇంతటి వేవ్‌లోనూ వారు YCP అభ్యర్థులపై ఓటమి చవిచూశారు. వారిలో ఎరిక్షన్ బాబు (Y.పాలెం), గొట్టిపాటి లక్ష్మీ (దర్శి), బీటెక్ రవి (పులివెందుల), రామచంద్రారెడ్డి (పుంగనూరు), జయచంద్రారెడ్డి (తంబళ్లపల్లి), బాలసుబ్రమణ్యం (రాజంపేట), బొజ్జ రోషన్న (బద్వేలు), వీరభద్రగౌడ్ (ఆలూరు), రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), రాజారావు (అరకు), గిడ్డి ఈశ్వరి (పాడేరు ) ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లో కలిపి 64 సీట్లకు గాను రెండే గెలిచింది. TG(8), కర్ణాటక(9)లో మరిన్ని సీట్లు గెలిచే ఆస్కారమున్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. ఒకవేళ ఈ 5 రాష్ట్రాల్లో మరిన్ని సీట్లు గెలిచుంటే ఆ పార్టీకి మొత్తం 120-130 సీట్లు వచ్చేవని, నాన్ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జనసేనానికి హోం శాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఇండియా టుడేతో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రస్ట్ అని వెల్లడించారు. మరి కేబినెట్ కూర్పులో సారథికి ఏ పదవి దక్కుతుందో. మీరు పిఠాపురం ఎమ్మెల్యేను ఏ మంత్రిగా చూడాలి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
AP: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. 1999 నుంచి 2024 వరకు ఆరు ఎన్నికలు జరగగా 6 పార్టీలను ఎన్నుకున్నారు. 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన పార్టీలను ఇక్కడ గెలిపించారు. తాజాగా ఇక్కడి నుంచి జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ 62,492 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా గెలవాలంటూ తెలుగు తేజం, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ ఇన్‌స్టా పోస్ట్ చేశారు. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ ఇవాళ తొలి మ్యాచ్ ఆడుతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో తిలక్ తల్లిదండ్రులు, సోదరుడు బ్లూ జెర్సీ ధరించగా వారి పెంపుడు కుక్కకూ టీమ్ఇండియా జెర్సీ వేయడం విశేషం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కంగ్రాట్స్ చెప్పారు. ‘ఎన్నికల్లో అపూర్వ విజయం అందుకున్న నా మిత్రులు.. చంద్రబాబు, సీఎం స్టాలిన్‌కు అభినందనలు. అలాగే మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
AP: ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇవాళ రాత్రి 8 గంటలకు ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. స్లో పిచ్ కావడంతో జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శివమ్ దూబే, పంత్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్‌దీప్, బుమ్రా, అర్ష్‌దీప్
Sorry, no posts matched your criteria.