News June 5, 2024
తనకు ఆసక్తి ఉన్న శాఖలు ఏంటో చెప్పిన పవన్ కళ్యాణ్
జనసేనానికి హోం శాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఇండియా టుడేతో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రస్ట్ అని వెల్లడించారు. మరి కేబినెట్ కూర్పులో సారథికి ఏ పదవి దక్కుతుందో. మీరు పిఠాపురం ఎమ్మెల్యేను ఏ మంత్రిగా చూడాలి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News December 5, 2024
పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం
క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.
News December 5, 2024
చైనాతో చేతులు కలిపిన నేపాల్
చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)లో భారత పొరుగు దేశం నేపాల్ చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం నేపాల్ ప్రధాని న్యూఢిల్లీకి వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి పీఎం కేపీ ఓలి శర్మ తాజాగా బీజింగ్ వెళ్లారు. సోమవారం నుంచీ అక్కడే ఉంటూ బీఆర్ఐలో చేరే ప్రక్రియపై చర్చలు జరిపారు. తాజాగా ఆ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు నేపాల్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.
News December 5, 2024
ప్రపంచంలోనే మోదీ తెలివైనోడు: కువైట్ మంత్రి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తెలివైనవారిలో ఒకరని కువైట్ విదేశాంగ మంత్రి అలీ అల్ యాహ్యా ప్రశంసించారు. తమకు ఎంతో విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ‘నన్ను భారత్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మోదీ ఈ దేశాన్ని ఒక మంచి దశలో ఉంచుతారు. భారత్‌తో మా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇరు దేశాల సంబంధాలను బలపరిచేందుకు యాహ్యా ఇక్కడికి వచ్చారు.