news

News September 5, 2025

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. 10 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,863 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభం పొంది 24,788 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, రిలయన్స్, టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో, ITC, HDFC, ICICI, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News September 5, 2025

తర్వాతి సినిమా నా కూతురు చూసేలా ఉండాలి: అలియా

image

తాను చేయబోయే తర్వాతి సినిమా కూతురు రాహా చూసేలా ఉండాలనుకుంటున్నట్లు హీరోయిన్ అలియా భట్ చెప్పారు. కూతురు చూసే సినిమాలను తాను ఇప్పటివరకూ చేయలేదని అన్నారు. చిన్నారి కోసమే జానర్ మార్చి కామెడీ కథలను ఎంచుకోనున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ 2026 మార్చి 20న రిలీజ్ కానుంది.

News September 5, 2025

రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,07,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.98,650 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,36,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 5, 2025

టీచర్ల ఆత్మస్థైర్యాన్ని YCP దెబ్బతీస్తోంది: లోకేశ్

image

AP: విద్య నేర్పే గురువుల పట్ల కూడా YCP నీచంగా వ్యవహరిస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. <<17608204>>పక్క రాష్ట్రం<<>>లో జరిగిన ఘటనను AP టీచర్లకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో జుగుప్సాకరంగా వైసీపీ ఫేక్ హ్యాండిల్స్‌లో ఫేక్ ప్రచారం చేస్తోంది. దీంతో YCP నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు దిగజారింది. ఇది క్షమించరాని నేరం’ అని ట్వీట్ చేశారు.

News September 5, 2025

అద్భుతం.. బాలభీముడు పుట్టాడు!

image

మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.

News September 5, 2025

మహిళల WC: రూ.100కే టికెట్

image

మహిళల వన్డే WC టికెట్ల ధరను ICC రూ.100గా నిర్ణయించింది. ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు లీగ్ మ్యాచులకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సెప్టెంబర్ 30న మొదలయ్యే ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించేందుకు గువహటిలో సింగర్ శ్రేయా ఘోషల్‌తో గ్రాండ్‌గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీలంకతో పాటు భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. విశాఖలో OCT 9, 12, 13, 16, 26 తేదీల్లో మ్యాచులున్నాయి.

News September 5, 2025

గాజాలో 64వేలు దాటిన మరణాలు

image

గాజాలో మరణాల సంఖ్య 64వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది మరణించగా వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామన్న హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. యుద్ధంలో ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News September 5, 2025

కెప్టెన్‌ బవుమా.. ఎదురులేని జట్టుగా ‘SA’

image

సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఎదురన్నదే లేకుండా దూసుకెళుతోంది. టెంబా బవుమా సారథ్యంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. హేమాహేమీలుగా పేరున్న టీమ్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆస్ట్రేలియాపై WTC ఫైనల్స్‌లో విజయం, ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో ODI సిరీస్‌ నెగ్గడం, 27ఏళ్ల తర్వాత తాజాగా ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవడం.. ఇవన్నీ బవుమా కెప్టెన్సీలో SA ఎదురులేని జట్టుగా ఎదుగుతోందని చెప్పేందుకు ఉదాహరణలు.

News September 5, 2025

CM చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్

image

AP: సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. ఇదివరకు ‘బెల్’ తయారు చేసిన ఛాపర్ వాడేవారు. అది ఎక్కువ దూరం ప్రయాణించేందుకు పనికిరాకపోవడంతో అత్యాధునిక ఫీచర్లతో కూడిన AIR Bus H160 మోడల్ హెలికాప్టర్ వాడుతున్నారు. సన్ లైట్ తగ్గినా, ఆకాశం మేఘావృతమైనా కొన్ని హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వరు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఛాపర్‌లో లైటింగ్ తక్కువగా ఉన్నా ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

News September 5, 2025

HYDలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది: హరీశ్

image

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రాతో ఎన్నారైలను రేవంత్ భయపెట్టారని, దీంతో వారు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారని లండన్ పర్యటనలో మండిపడ్డారు. ఇప్పటికీ బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే విజయమన్నారు.