news

News March 18, 2024

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్

image

TS: సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. రేపు సాయంత్రం ఆయన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.

News March 18, 2024

టెట్ ఫలితాల విడుదల ఎప్పుడు?

image

AP: గత నెలలో నిర్వహించిన ‘టెట్’ ఫలితాలు ఈ నెల 14నే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్‌ను విడతలవారీగా నిర్వహించినందున మార్కులను నార్మలైజేషన్ చేయాల్సి ఉండటంతో ఆలస్యం అయినట్లు సమాచారం. టెట్‌లో అర్హత సాధిస్తేనే DSCకి అర్హులవుతారు. అలాగే టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

News March 18, 2024

CSKvsRCB: టికెట్స్ కోసం అశ్విన్ కష్టాలు

image

ఈనెల 22వ తేదీన IPL2024 మొదలుకానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ మొదలవగా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ప్రారంభోత్సవ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని తన పిల్లలు కోరుకుంటున్నట్లు RR ప్లేయర్ అశ్విన్ ట్వీట్ చేశారు. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్స్ దొరకలేదని, CSK సాయం చేయాలని కోరారు.

News March 18, 2024

BREAKING: ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు

image

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌తో పాటు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News March 18, 2024

GOOD NEWS: అయ్యర్ ఫిట్‌గా ఉన్నారు!

image

కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, కాలును సాగదీసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనే ముందుజాగ్రత్తలు పాటించాలని వారు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా అయ్యర్ ఇటీవల వెన్నునొప్పితో సతమతమయ్యారు. దీంతో ఇంగ్లండ్‌తో సిరీస్ మధ్యలో వైదొలిగిన విషయం తెలిసిందే.

News March 18, 2024

ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదం.. ఈసీకి ఫిర్యాదు

image

నిన్న ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదంగా మారింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ TMC ఎంపీ సాకేత్ గోఖలే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే 1975లో ఇందిరాగాంధీపై అనర్హత వేటు పడిందని చెప్పారు. ఒక వేళ బీజేపీ IAF చాపర్‌కు రెంట్ చెల్లించి ఉంటే.. దానికి గల కారణాలను కూడా ఈసీ వెల్లడించాలని కోరారు.

News March 18, 2024

రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం

image

ఆర్సీబీ మహిళల జట్టు WPL కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకు శుభాకాంక్షలు చెప్పే బదులు పురుషుల జట్టును ట్రోల్ చేసేలా రాజస్థాన్ రాయల్స్ ఓ ట్వీట్ చేసింది. పురుషులు చేయలేనిది మహిళలు చేశారన్న అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. దానిపై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.

News March 18, 2024

పోలీసుల తీరుపై అనుమానాలున్నాయి: నాదెండ్ల

image

AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్‌లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.

News March 18, 2024

పెంగ్విన్లను లెక్కపెట్టడమే పని!

image

మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్‌రాయ్‌లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య ఐదు నెలల పాటు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే కోసం పనిచేయాలట. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

News March 18, 2024

CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని SECకి అచ్చెన్న లేఖ

image

AP: 23 ప్రభుత్వ వెబ్‌సైట్లలో CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ‘ఈ నెల 16వ తేదీ మ.3 గంటల నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదు. కానీ ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఇంకా సీఎం, మంత్రుల చిత్రాలు ఉన్నాయి. వెంటనే వాటిని తొలగించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

error: Content is protected !!