News March 18, 2024

పోలీసుల తీరుపై అనుమానాలున్నాయి: నాదెండ్ల

image

AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్‌లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.

Similar News

News February 17, 2026

NTR: స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం!

image

VJA కార్పొరేషన్ పరిధిలో స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం నెలకొంది. వీటి నిర్మాణానికి 2018లో కేంద్రం రూ.460 కోట్లను కేటాయించగా L&T సంస్థ పనులను చేపట్టింది. అప్పట్లో 59% పనులకు రూ.211 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 41% పనులకు రూ.600 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్‌‌తో కొత్తగా డ్రైన్స్ నిర్మిస్తారా..? లేదా మిగిలిన పనులనే కొనసాగిస్తారా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.

తిరుపతి కలెక్టరేట్‌కు 443 అర్జీలు.!

image

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 443 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం తెలిపారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు తాగునీరు, మెడికల్ క్యాంప్, టీ వంటి సౌకర్యాలు కల్పించి వారి వినతులను స్వీకరించామన్నారు. శాఖలవారీగా రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 280 అర్జీలు వచ్చాయన్నారు.