news

News March 18, 2024

‘శక్తిమాన్’కు రణ్‌వీర్ కరెక్ట్ కాదు: ముకేశ్ ఖన్నా

image

ముకేశ్ ఖన్నా హీరోగా 1997 నుంచి 2005 మధ్యకాలంలో ప్రసారమైన శక్తిమాన్ సీరియల్ చిన్నారుల్ని విపరీతంగా అలరించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌తో దీన్ని సినిమాగా తెరకెక్కించనున్నారు. ఆ నిర్ణయంపై ముకేశ్ పెదవివిరిచారు. ‘శక్తిమాన్ అంటే కేవలం సూపర్ హీరో మాత్రమే కాదు. ఒక టీచర్. ఆ పాత్ర చేసే వ్యక్తి ఏదైనా చెప్తే పదిమంది వినేలా ఉండాలి. రణ్‌వీర్ ఇమేజ్ అందుకు అడ్డు నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.

News March 18, 2024

లిక్కర్ స్కామ్‌లో 15 మంది అరెస్ట్: ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజుల కస్టడీకి అనుమతించిందని పేర్కొంది. మరోవైపు కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

News March 18, 2024

నీటి ఆదాకు డాక్టర్ టిప్స్

image

కర్ణాటకలో కొన్ని రోజులుగా నీటి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటి ఆదా విషయంలో బెంగళూరు డాక్టర్ దివ్యశర్మ తాను పాటించిన టిప్స్ చెప్పారు. ఓవర్ హెడ్ షవర్ల తొలగింపు, కుళాయిల నుంచి నీరు ధారగా పడకుండా ఏరేటర్స్ ఏర్పాటు, ప్యూరిఫయర్ నుంచి వచ్చే నీటితో ఇల్లు తుడవడం, మొక్కలకు వాడటం, కార్ వాషింగ్ ఆపేసి తడి వస్త్రంతో శుభ్రం చేశామని చెప్పుకొచ్చారు. డాక్టర్ టిప్స్‌ను పలువురు స్వాగతిస్తున్నారు.

News March 18, 2024

ఇది యూకేజీ ఫీజా.. ఆస్తులు అమ్మాల్సిందే!

image

పిల్లల్ని కిండర్‌గార్టెన్(కేజీ) చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చు. అంతేకదా..? కానీ ఓ పాఠశాలలో మాత్రం అక్షరాలా రూ.2,72,718 కట్టాల్సి ఉంటుంది. అందులో రూ.33వేలు తర్వాత రిఫండ్ ఇస్తారట. దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘ఇది యూకేజీ ఫీజా..? పిల్లల్ని ఇలా చదివించాలంటే మా ఆస్తులు అమ్మాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 18, 2024

నాలుగు నెలల మనవడికి మూర్తి రూ.240కోట్లు గిఫ్ట్!

image

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం మూర్తి షేర్లు 0.40% నుంచి 0.36శాతానికి తగ్గాయి. కాగా గత ఏడాది నవంబరులో నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి-అపర్న కృష్ణన్ దంపతులు ఏకగ్రహకు జన్మనిచ్చారు.

News March 18, 2024

పుతిన్‌కు మోదీ అభినందనలు

image

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 88శాతం ఓట్లతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News March 18, 2024

BRSలో చేరిన RS ప్రవీణ్‌ కుమార్

image

TG: ఇటీవల BSPని వీడిన RS ప్రవీణ్‌ కుమార్ BRSలో చేరారు. ఎర్రవల్లిలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆయన అనుచరులు కూడా BRS తీర్థం పుచ్చుకున్నారు.

News March 18, 2024

వెల్‌కమ్.. ఆర్ఎస్పీ గారూ: కేటీఆర్

image

TG: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్‌లోకి స్వాగతం పలికారు. ‘డాక్టర్ ఆర్ఎస్పీ గారూ బీఆర్ఎస్‌లోకి స్వాగతం. జై తెలంగాణ. జై భీమ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News March 18, 2024

రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం: ED

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ‘లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేశాం. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది. ఆప్ నేతలకు వంద కోట్లు చేర్చారు. 240 చోట్ల సోదాలు చేశాం. రూ.128 కోట్ల ఆస్తులను జప్తు చేశాం. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌లతో కవితకు సంబంధం ఉంది’ అని తెలిపింది.

News March 18, 2024

ఈడీకి కవిత భర్త లేఖ

image

తాను విచారణకు రాలేనని ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఈడీకి లేఖ రాశారు. ఈ కేసులో అనిల్ ప్రమేయం ఉందా? లేదా? అని విచారించేందుకు 3 రోజుల క్రితం ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. కోర్టు అనుమతితో కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం అని తెలిపింది.

error: Content is protected !!