India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరులోని కొందరు చెఫ్‌లు వినూత్నంగా ఆలోచించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు ఏకంగా 123 అడుగుల పొడవైన దోశను తయారు చేశారు. మొత్తం 75 మంది చెఫ్‌లు కలిసి ఈ భారీ దోశను వేశారు. దాదాపు 110 విఫల ప్రయత్నాల తర్వాత ఈ రికార్డు నమోదైంది. అంతకుముందు, గిన్నిస్ రికార్డ్స్‌లో 16.68 మీటర్లు (54 అడుగుల 8.69 అంగుళాలు) దోశ ఉండేది.
సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200 పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సీఏఏ అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్లు.. మతాల ప్రాతిపదికన రూపొందిన ఈ చట్టం ముస్లిములపై వివక్ష చూపేలా ఉందన్నారు. CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. పిటిషనర్లలో టీఎంసీ నేత మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఉన్నారు.
తెలంగాణ గవర్నర్ బాధ్యతల్ని రాష్ట్రపతి ఎవరికి అప్పగిస్తారన్న ఉత్సుకతకు తెరపడింది. ఏపీ గవర్నర్ నజీర్‌కే తోటి తెలుగు రాష్ట్రం బాధ్యతల్ని ఇస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తాత్కాలికంగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించడం, రోహిత్ ఫ్యాన్స్‌కు ఇంకా మింగుడుపడటం లేదు. రోహిత్ గురించి తాజా ప్రెస్‌మీట్‌లో అడిగిన పలు <<12878272>>ప్రశ్నల్ని <<>>అటు హార్దిక్, ఇటు కోచ్ బౌచర్ దాటవేశారు. దీంతో ఫ్యాన్స్ ఇంకా మండిపడుతున్నారు. ‘రెస్ట్ ఇన్ పీస్ హార్దిక్ పాండ్య’ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను రోహిత్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్‌తో ఏకంగా 42వేలకు పైగా పోస్టులు రావడం గమనార్హం.
సినిమాల కోసం నటీనటులు తమని తాము పూర్తిగా మార్చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో రణదీప్ హుడా ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తన కొత్త చిత్రం ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ కోసం రణదీప్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు. మూవీలో ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్ర కోసం ఆయన ఇలా అయ్యారు. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది.
TG: తీహార్ జైలు క్లబ్‌లో త్వరలో సభ్యులు కాబోతున్నారంటూ MLC కవితను ఉద్దేశించి మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ‘మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, సీఎం కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది’ అని లేఖలో పేర్కొన్నారు.
TG: అకాల వర్షాలు అన్నదాత కష్టాన్ని నీటిపాలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అంచనా. ఒక్క కామారెడ్డిలోనే 21వేల ఎకరాల పంట దెబ్బతింది. వరి, జొన్న, మిర్చి, పొగాకు, శనగ వంటి పంటల నష్టంతో పాటు మామిడి, చింత చెట్ల పూత, కాయలు సైతం రాలిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ చట్నీస్‌కు షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐటీ అధికారులు ఈరోజు సోదాలు జరిపారు. ఈ సంస్థ యజమాని అట్లూరి పద్మ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు కావడం గమనార్హం. అటు ఆమె ఇంటి వద్ద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల తనయుడు రాజారెడ్డికి, పద్మ కుమార్తె ప్రియకు ఇటీవల ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన సూపర్ హిట్ లవ్ స్టోరీ ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే రీరిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ 1994లో తెలుగు, తమిళంలో రిలీజై సంచలన విజయం సాధించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్. దివంగత SPB, వడివేలు, రఘువరన్, గిరీశ్ కర్నాడ్ కీలక పాత్రలు పోషించారు.
AP: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. స్కిల్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సీఐడీ సుప్రీంలో సవాల్ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.
Sorry, no posts matched your criteria.