News March 19, 2024
నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

AP: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. స్కిల్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సీఐడీ సుప్రీంలో సవాల్ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.
Similar News
News February 12, 2025
యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ వచ్చింది: పరిణీత తండ్రి

మధ్యప్రదేశ్‌కు చెందిన పరిణీత సంగీత్ వేడుకలో డాన్స్ చేస్తూ <<15414198>>గుండెపోటుతో<<>> చనిపోయిన ఘటనపై ఆమె తండ్రి సురేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వారం క్రితమే పరిణీత అన్ని టెస్టులు చేయించుకోగా నార్మల్ అని వచ్చింది. ఆమె చనిపోతుందనే ముందస్తు హెచ్చరిక, సంకేతం ఏదీ కనిపించలేదు. ఆమె ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది. రోజూ యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉండేది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News February 12, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. ఇవాళ జరిగిన చివరి వన్డేలో ఇండియా 142 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 357 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 214 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్, బ్యాంటన్ చెరో 38 రన్స్‌తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. IND బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్, హార్దిక్, అక్షర్ తలో 2, సుందర్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు గిల్ <<15440761>>సెంచరీతో<<>> రాణించారు.
News February 12, 2025
కర్ణాటకలో తొలి కారుణ్య మరణం ఈవిడదే!

ఎప్పటికీ నయమవ్వని వ్యాధులతో బాధపడుతోన్న వారికి <<15326754>>కారుణ్య మరణం<<>> పొందే హక్కు కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో తొలి మరణం 85 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కరిబసమ్మది కానుంది. ఆమె మూడు దశాబ్దాలకు పైగా స్లిప్డ్ డిస్క్ కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు. క్యాన్సర్ బారిన కూడా పడి నరకం అనుభవిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో గౌరవంగా మరణించే హక్కును ఈమె పొందారు.