news

News March 19, 2024

ఎకరాకు రూ.10 వేల పరిహారమివ్వాలి: హరీశ్

image

TG: మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేసినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు.

News March 19, 2024

బీజేపీకి షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ ఇచ్చారు కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి ప్రెసిడెంట్ పశుపతి కుమార్ పరాస్. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. NDA కోసం నిజాయతీగా పనిచేసినా తమ పార్టీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ NDA నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. కాగా బిహార్ తరఫున NDA నిన్న ప్రకటించిన లోక్‌సభ సీట్లలో RLJPకి ఒక్క సీటూ కేటాయించలేదు.

News March 19, 2024

ఇవాళో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా?

image

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటిలోగా కొంతమంది పేర్లను ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటుండగా.. 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. మరో 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై CBN సమాలోచనలు చేస్తున్నారు.

News March 19, 2024

NDA కూటమిలో చేరనున్న MNS?

image

మహారాష్ట్రలోని MNS(మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) పార్టీ NDA కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు MNS చీఫ్ రాజ్ థాక్రేకి, BJP సీనియర్ లీడర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్ థాక్రే తన కుమారుడు అమిత్ థాక్రేతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు బంధువే ఈ రాజ్ థాక్రే. ఆయన శివసేనను వీడి 2006లో MNSను స్థాపించారు.

News March 19, 2024

WPLపై విమర్శలు.. పాక్ అభిమానికి చురకలు

image

ట్విటర్‌లో పాకిస్థాన్ క్రికెట్ అప్డేట్స్ ఇచ్చే ఫరీద్ ఖాన్‌ మరోసారి ఇండియాపై తన అక్కసు వెల్లగక్కాడు. ‘WPL విజేతకు 8 అంకెల ప్రైజ్ మనీ ఇస్తే.. PSL విజేతకు 9 అంకెల ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇక్కడా పాక్ గెలిచింది. ఇప్పుడు ఏదైనా చెప్పు ఇండియా’ అని ట్వీట్ చేశాడు. దీనిపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. పాకిస్థాన్ కరెన్సీకి, ఇండియా కరెన్సీకి తేడా ఎంతో తెలుసుకోమని చురకలంటిస్తున్నారు.

News March 19, 2024

బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల కొరత: సీఎం సిద్ధరామయ్య

image

బెంగళూరు ప్రజలు నీటి కటకటతో అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ‘నీటి కుంటలు కనుమరుగవడం లేదా ఆక్రమణకు గురయ్యాయి. 6,900 బోర్లు ఎండిపోయాయి. నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం కావేరీ నది నుంచి 147 కోట్ల లీటర్లు, బోర్ల నుంచి 65 కోట్ల లీటర్లు వస్తోంది’ అని తెలిపారు.

News March 19, 2024

కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న సిద్ధూ

image

భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ కామెంట్రీ బాక్స్‌లో సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధూ ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్‌లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

News March 19, 2024

పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత

image

తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కవిత అరెస్టైనందున ఆ పిటిషన్ నిరర్థకమైందని, అందుకే వెనక్కి తీసుకుంటున్నామని వారు వివరించారు. వారి విజ్ఞప్తిని పరిగణించిన ధర్మాసనం 11 గంటలకు కేసును పాస్ ఓవర్ చేసింది.

News March 19, 2024

11 ఏళ్ల విద్యార్థినితో ప్రధాని మోదీ.. ఎందుకంటే?

image

తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ సభల్లో ప్రసంగించడంతో పాటు కొంత సమయాన్ని ఓ విద్యార్థిని అభినందించడానికి కేటాయించారు. హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న 11 ఏళ్ల ఆకర్షణ అనే విద్యార్థిని మోదీ అభినందించారు. ఆమె ఇప్పటివరకూ 10 లైబ్రరీలను ఏర్పాటు చేయగా.. 25వ లైబ్రరీ ప్రారంభించేందుకు తాను వస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆమెకు మోదీ సూచించారు.

News March 19, 2024

రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్

image

శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగా తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా బోర్డు సూచనతో నిర్ణయం మార్చుకున్నారు. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు లంక జట్టులో ప్లేస్ సాధించారు. దీంతో ఐపీఎల్‌లో SRH జట్టు తరఫున తొలి 3 మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!