news

News March 24, 2024

లక్నోపై రాజస్థాన్ గెలుపు

image

IPL2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20ఓవర్లలో 193 రన్స్ చేసింది. ఛేదనలో లక్నో 173/6కే పరిమితమైంది. రాజస్థాన్ కెప్టెన్ శాంసన్(82*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు.

News March 24, 2024

హోలీ రోజు ఈ వస్తువులను దానం చేయకండి!

image

ఏటా ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ ఈ నెల 25న రాగా ఆ రోజున కొన్ని వస్తువులు దానం చేయరాదని చెబుతున్నారు. డబ్బు, పాలు, పెరుగు, పంచదార, ఆవాల నూనె, తెల్లటి వస్తువులు, పెళ్లైన స్త్రీలు పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, మేకప్ కిట్, స్టీల్ పాత్రలు వంటివి దానం చేయకూడదట. దానం చేస్తే కష్టాలు, నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

News March 24, 2024

తేలు, గుర్రం.. అని పిలుచుకుంటారు!

image

ఉత్తర్ ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌ గ్రామంలో పేర్లన్నీ వింతగా ఉంటాయి. ఆ ఊరిలో అడుగుపెట్టగానే బిచ్చూ(తేలు), చిడియా(పిట్ట), గప్పడ్(కబుర్లు చెప్పేవాడు), ఘోడా(గుర్రం) అనే పేర్లు వినిపిస్తుంటాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ ఊరిలో అప్పట్లో ప్రజల రూపం, క్యారెక్టర్, చేసే పనిని బట్టి వారికి పేర్లు పెట్టేవారు. తరాలు మారే కొద్దీ అవి ఇంటి పేర్లుగా మారిపోయాయి. ఇప్పటికీ అవే పేర్లతో ప్రజలు ఒకరినొకరు పిలుస్తూ ఉన్నారు.

News March 24, 2024

అసదుద్దీన్ వాడే కారుపై రూ.10,485 చలాన్లు

image

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వినియోగిస్తున్న కారుపై భారీగా పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఆయన వాడుతున్న TS11EV9922 డిఫెండర్ వాహనంపై 2021 నుంచి ఇప్పటివరకు రూ.10,485 చలాన్లు పడ్డాయి. అప్పటినుంచి ట్రాఫిక్ పోలీసులు రెండుసార్లు పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అవకాశం కల్పించినా ఇవి చెల్లించలేదు. ఇందులో చాలా చలాన్లు ORRపై ఓవర్ స్పీడుతో వెళ్లడంతోనే పడ్డట్లు సమాచారం.

News March 24, 2024

11 పరుగులకే 3 వికెట్లు.. లక్నో ‘సెల్ఫ్ సెటైర్’

image

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆరంభంలోనే లక్నోకు షాక్ తగిలింది. ఆ జట్టు 3.1 ఓవర్లలోనే 11 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. డికాక్(4), పడిక్కల్(0), బదోని(1) వెనువెంటనే ఔటయ్యారు. దీంతో తమ జట్టు పరిస్థితి అర్థమయ్యేలా ‘HOW TO NOT CRY’ అనే బుక్‌ను చదువుతున్న ఫొటోను LSG షేర్ చేసింది. దీంతో ‘సెల్ఫ్ సెటైర్’ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News March 24, 2024

త్రిప్తితో డేటింగ్ చేయాలనుంది: నటుడు

image

యానిమల్ సినిమాలో నటించిన త్రిప్తి దిమ్రీ గ్లామర్‌కు యూత్ ఫిదా అయింది. ఆ ఒక్క సినిమాతో ఆమె నేషనల్ క్రష్‌గా మారిపోయారు. కాగా ఇదే సినిమాలో హీరో రణ్‌బీర్ కపూర్‌కి బావగా నటించిన సిద్ధాంత్ కర్నిక్ కూడా త్రిప్తిపై మనసు పారేసుకున్నట్లున్నారు. ఆమెతో డేటింగ్ చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

News March 24, 2024

పాలు చెడిపోయాయి.. రూ.77 వేలు ఉఫ్

image

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ గ్రాసరీ యాప్ నుంచి పాలు ఆర్డర్ చేసింది. అయితే పాలు చెడిపోవడంతో రిటర్న్ చేద్దామని ప్రయత్నించిన ఆమెకు షాక్ తగిలింది. ఇంటర్నెట్‌లో కనిపించిన కస్టమర్ కేర్ నంబరుకు కాల్ చేసింది. ఓ వ్యక్తి కస్టమర్ కేర్ ప్రతినిధిగా మాట్లాడి డబ్బులు రిఫండ్ చేస్తామని నమ్మించాడు. ఆమె బ్యాంకు ఖాతా వివరాలు రాబట్టి రూ.77వేలు దోచేశాడు. దీంతో ఆమె సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది.

News March 24, 2024

భారత ప్లేయర్లకు పురస్కారాలు

image

టీమ్ ఇండియా మహిళా క్రికెటర్లు శ్రేయాంకా పాటిల్, షఫాలీ వర్మ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. తనకు క్రికెట్‌లో స్టార్ ప్లేయర్ కోహ్లీ స్ఫూర్తి అని శ్రేయాంక తెలిపారు. గత సీజన్‌లో విరాట్ ఇచ్చిన ధైర్యం అందరిలో స్ఫూర్తి నింపిందన్నారు. మరోవైపు 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ‘యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.

News March 24, 2024

త్వరలోనే పిఠాపురంలో ప్రచారం: పవన్

image

AP: త్వరలోనే పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తానని జనసేనాని పవన్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ మంత్రి రంగారావు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి పవన్‌కు వర్మ వివరించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

News March 24, 2024

కష్టాల్లో లక్నో

image

రాజస్థాన్‌తో మ్యాచులో లక్నో కష్టాల్లో పడింది. 194 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 8 ఓవర్లలో 60 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయింది. హుడా 26, డీకాక్ 4, బదోనీ 1, పడిక్కల్ డకౌట్ అయ్యారు. క్రీజులో రాహుల్, పూరన్ ఉన్నారు. RR బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు. బర్గర్, చాహల్ తలో వికెట్ తీశారు.

error: Content is protected !!