news

News March 25, 2024

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావట్లేదని..

image

TG: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావట్లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్(D) మల్లారెడ్డిపల్లికి చెందిన కార్తీక్.. బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులు అతని పేరెంట్స్‌తో మాట్లాడగా, తమ పెద్ద కొడుకు పెళ్లాయ్యాకే చిన్న కొడుకు(కార్తీక్) వివాహం చేస్తామన్నారు. దీంతో ఆలస్యమవుతోందని పెద్దలు ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలిసి కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు.

News March 25, 2024

HYD బీఆర్ఎస్ MP అభ్యర్థి ఫిక్స్

image

TG: హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.

News March 25, 2024

‘కల్కి’లో నా భాగం షూటింగ్ పూర్తయ్యింది: కమల్ హాసన్

image

క్వాలిటీలో రాజీ పడకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండియన్-2, 3 చిత్రాల షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఇండియన్-2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆ తర్వాత మూడో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం. కల్కి 2898ADలో నా భాగం షూటింగ్ పూర్తి చేశాం. ఎన్నికలు ముగిశాక మణిరత్నంతో థగ్ లైఫ్ మూవీ చిత్రీకరణ మొదలు పెడతాం’ అని తెలిపారు.

News March 25, 2024

గోవాలో తొలిసారి మహిళకు బీజేపీ ఎంపీ టికెట్

image

గోవాలో తొలిసారిగా బీజేపీ నుంచి ఓ మహిళ లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది. పల్లవి భర్త శ్రీనివాస్.. గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నారు. కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది.

News March 25, 2024

సందేశ్‌ఖాలీ బాధితురాలికి బీజేపీ ఎంపీ టికెట్

image

ప.బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘సందేశ్‌ఖాలీ’ వివాదంలో బాధిత మహిళ రేఖా పత్రాను బసిర్‌హట్ MP అభ్యర్థిగా BJP నిలబెట్టింది. ఈ పార్లమెంట్‌ పరిధిలో‌నే ఆ గ్రామం ఉంది. ఇటీవల అధికార TMC పార్టీకి చెందిన షాజహాన్ షేక్ మహిళలపై అకృత్యాలకు పాల్పడటంతో పాటు భూముల లాక్కుంటున్నట్లు వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై బాధితురాలు రేఖా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 25, 2024

హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్, చంద్రబాబు

image

AP: సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నా. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు’ అని చంద్రబాబు పోస్ట్ పెట్టారు.

News March 25, 2024

హైదరాబాద్ VS చెన్నై.. టికెట్ల బుకింగ్ షురూ

image

ఐపీఎల్-2024లో భాగంగా ఏప్రిల్ 5న HYDలో జరగనున్న SRH, CSK మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://insider.in/hyderabad వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండు టికెట్లు కొంటే ఒక ఫ్యాన్ జెర్సీ ఫ్రీగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 25, 2024

గంజాయి తాగించి స్నేహితుడిని చంపేశాడు

image

TG: గంజాయి మత్తులో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి <<12915954>>అత్యాచారం<<>> చేయగా, తాజాగా ఓ యువకుడు ఫ్రెండును చంపేశాడు. HYD బాలానగర్‌లో స్నేహితులు ప్రణీత్(20), సమీర్(20) గంజాయికి బానిసలయ్యారు. ఇటీవల సమీర్ తల్లిని ప్రణీత్ దూషించాడు. ఇది మనసులో పెట్టుకున్న సమీర్.. నిన్న ఉదయం ప్రణీత్‌ను బయటికి తీసుకెళ్లాడు. గంజాయి తాగించి కత్తితో పొడిచేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

News March 25, 2024

విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి?

image

AP: పొత్తులో భాగంగా బీజేపీ కోసం జనసేన వదులుకున్న సీటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. ఈయన NTR జిల్లా కంచికచర్లకు చెందిన వారే. కాగా టీడీపీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుజనా చౌదరి.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగాను పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాగా ఈ సీటు తమకే కేటాయించాలని స్థానిక జనసేన నేత పోతిన మహేశ్ వర్గం ఆందోళన చేస్తోంది.

News March 25, 2024

ఆ 23లో జనసేనకు ఒకటి

image

AP: గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ 23 నియోజకవర్గాలు TDPకి కంచుకోటల్లా నిలిచాయి. పొత్తులో భాగంగా వీటిలో నుంచి ఓ సీటు జనసేనకు దక్కింది. వైజాగ్ సిటీలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ స్థానాల్లో TDP అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా.. విశాఖ దక్షిణ స్థానాన్ని జనసేనకు టీడీపీ కేటాయించింది. ఇంకా జనసేన అభ్యర్థి ఖరారు కాలేదు. 2019లో ఇక్కడి జనసేన అభ్యర్థి గంపల గిరిధర్‌కు 18,119 ఓట్లు పోలయ్యాయి.

error: Content is protected !!