News March 25, 2024
‘కల్కి’లో నా భాగం షూటింగ్ పూర్తయ్యింది: కమల్ హాసన్
క్వాలిటీలో రాజీ పడకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండియన్-2, 3 చిత్రాల షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఇండియన్-2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆ తర్వాత మూడో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం. కల్కి 2898ADలో నా భాగం షూటింగ్ పూర్తి చేశాం. ఎన్నికలు ముగిశాక మణిరత్నంతో థగ్ లైఫ్ మూవీ చిత్రీకరణ మొదలు పెడతాం’ అని తెలిపారు.
Similar News
News November 7, 2024
రోహిత్ కెప్టెన్సీ కొనసాగించాల్సిందే: ఫించ్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆ సిరీస్ అంతటికీ కొత్త కెప్టెన్‌ను నియమించాలని గవాస్కర్ ఇటీవల పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ ఆ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘రోహిత్ భారత్‌కి కెప్టెన్. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఎంజాయ్ చేసే హక్కు అతడికి కచ్చితంగా ఉంటుంది. తిరిగి వచ్చాక అతడే మళ్లీ కెప్టెన్‌గా ఉండాలి’ అని స్పష్టం చేశారు.
News November 7, 2024
ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!
మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.
News November 7, 2024
PHOTOS: కన్నీళ్లు పెట్టుకున్న కమల మద్దతుదారులు
అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ తీవ్రంగా పోరాడినా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. కౌంటింగ్ సందర్భంగా ఆమె ఏ దశలోనూ ట్రంప్‌ను అందుకోలేపోయారు. ఫలితాల సరళిని బట్టి కమల ఓటమి లాంఛనం కావడాన్ని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతం అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.