news

News November 29, 2024

First Time: జట్టులోని 11 మంది బౌలింగ్

image

T20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. ఒకే మ్యాచ్‌లో 11 మంది బౌలింగ్ చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మణిపుర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ 11 మందితో బౌలింగ్ చేయించారు. వికెట్ కీపర్ బదోనీ కూడా బౌలింగ్ వేసి 1 వికెట్ తీశారు. ఇలా జట్టులోని అందరు ఆటగాళ్లతో బౌలింగ్ చేయించడం ఇదే తొలిసారి. కాగా ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. IPLలో దక్కన్ ఛార్జర్స్, RCB 9 మంది బౌలర్లను ఉపయోగించాయి.

News November 29, 2024

ఐక్యంగా లేకపోతే ఎలా?.. పార్టీ నేతలకు ఖర్గే క్లాస్

image

హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి ఓ సందేశంగా భావించి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పార్టీ నేత‌ల‌కు AICC అధ్యక్షుడు ఖ‌ర్గే క్లాస్ తీసుకున్నారు. CWC స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ అంత‌ర్గ‌తంగా ఐక్య‌త లోపించ‌డం పెద్ద స‌మ‌స్య అని అన్నారు. నేత‌ల ప‌ర‌స్ప‌ర విరుద్ధ వ్యాఖ్య‌లు పార్టీకి న‌ష్టం చేస్తున్నాయని ఘాటుగా స్పందించారు. ఐక్యంగా లేక‌పోతే ప్ర‌త్య‌ర్థిని ఎలా ఓడిస్తామని ప్ర‌శ్నించినట్టు తెలిసింది.

News November 29, 2024

DAO ఫలితాలు విడుదల

image

డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) గ్రేడ్-2 ఫలితాలను TGPSC విడుదల చేసింది. మొత్తం 53 పోస్టులకు 1,06,253 మంది దరఖాస్తు చేశారు. తాజాగా మల్టీ జోన్-1, 2 వారీగా ఫలితాలు వెలువడ్డాయి. నేరుగా హాల్‌టికెట్ నంబర్ చూసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 29, 2024

సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన

image

AP: మాజీ సీఎం, YSRCP అధినేత YS జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ప్రతి రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సమీక్షిస్తారు.

News November 29, 2024

PM విశ్వ‌క‌ర్మ ప‌థ‌కంపై తమిళనాడులో వివాదం

image

కుల ఆధారిత అసమానతలను పెంపొందించే అవకాశం ఉన్నందున ‘PM విశ్వ‌క‌ర్మ’ ప‌థ‌కాన్ని తిరస్కరిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 రకాల చేతి వృత్తుల క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించే ఈ ప‌థ‌కానికి వార‌సత్వంగా వృత్తిని స్వీక‌రించిన వారే అర్హుల‌న‌డం వివాద‌మైంది. ఇత‌ర వ‌ర్గాల‌ను ఎంపిక చేయకపోవడం వివ‌క్ష చూప‌డమే అని పేర్కొంది. అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ తామే కొత్త ప‌థ‌కాన్ని తెస్తామ‌ని తెలిపింది.

News November 29, 2024

ఇదెక్కడి మాస్ రా మావా..!

image

మనకు నచ్చని పని చేసేందుకు వెనకాడుతున్నట్లే.. కప్పలు కూడా మగవాటితో సంభోగం ఇష్టం లేకుంటే అవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కప్పలు మగవాటి దృష్టిని మళ్లించేందుకు చనిపోయినట్లు నటిస్తాయని కెమెరాలో రికార్డయింది. కలయిక ఇష్టం లేని సమయంలో దాన్నుంచి తప్పించుకోవడానికి కప్పలు వంటివి ఇలా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవర్తించడాన్ని గుర్తించారు. తెలివిగా కదలకుండా, కళ్లు మూసుకొని, నిర్జీవ స్థితిలో ఉంటున్నాయి.

News November 29, 2024

హిందువులపై దాడులు మీడియా సృష్టి కాదు: భారత్

image

బంగ్లాలో హిందువులపై దాడి మీడియా స‌ృష్టి కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ‘హిందువులే లక్ష్యంగా బంగ్లాలో జరుగుతున్న దాడుల గురించి భారత్ క్రమం తప్పకుండా ఆ దేశ ప్రభుత్వం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హింసాత్మక దాడులు, హిందువులపై ఉగ్రముద్రను మీడియా ఊహగానాలుగా కొట్టిపారేయకూడదు. మైనారిటీలను రక్షించాలని బంగ్లాకు స్పష్టం చేశాం’ అని తెలిపారు.

News November 29, 2024

48వేల ఫొటోల్లో ‘ది బెస్ట్’ ఇదే!

image

ఏంటీ చిట్టెలుకలు గొడవపడుతున్న ఫొటోను పెట్టారు అనుకుంటున్నారా? ఇది మామూలు ఫొటో కాదండోయ్. 2019 వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ LUMIX పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. లండన్‌లోని ఓ అండర్‌గ్రౌండ్‌ సబ్ వేలో ఎలుకలు పోరాడుతుండగా ఫొటోగ్రాఫర్ సామ్ రౌలీ ఫొటో తీశారు. ఈ పోటీలో మొత్తం 48,000 కంటే ఎక్కువ ఫొటోలు సమర్పించగా దీనికి అంతా జై కొట్టారు. తాజాగా ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.

News November 29, 2024

ఛాంపియన్స్ ట్రోఫీపై ICC స‌మావేశం వాయిదా

image

ఛాంపియ‌న్స్ ట్రోఫీపై ICC కీల‌క స‌మావేశం శ‌నివారానికి వాయిదా ప‌డింది. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆతిథ్య పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించేందుకు భార‌త్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఛాంపియ‌న్స్ ట్రోఫీని పాక్‌లో కొన‌సాగించినా భార‌త మ్యాచ్‌ల‌ను హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో త‌ట‌స్థ వేదిక‌ల‌పై నిర్వ‌హించాల‌ని BCCI కోరింది. ఈ విష‌యాన్ని తేల్చ‌డానికి ICC త‌ల‌పెట్టిన కీల‌క స‌మావేశం అనూహ్యంగా రేపటికి వాయిదా ప‌డింది.

News November 29, 2024

రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం: పవన్

image

AP: బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్‌వర్క్ పనిచేస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని Dy.CM పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కిలో బియ్యం రూ.73 చొప్పున విదేశాలకు అమ్ముతూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్ద భద్రతా లోపమే దీనికి కారణమని, సెక్యూరిటీ పెంచేలా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఏ సంస్థతో విచారణ జరపాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.