India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కోచ్‌గా జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీ నియమితులయ్యారు. నీరజ్ టెక్నిక్, పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఆయన ట్రైనింగ్ ఇవ్వనున్నారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జెలెజ్నీ ఒలింపిక్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ సాధించారు. మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. జావెలిన్‌ను అత్యధిక దూరం(98.48మీ) విసిరిన రికార్డు ఆయన పేరిటే ఉంది.

TG: సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సన్న వడ్లకే బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదని విమర్శించారు.

TG: సాధారణంగా ఒక గ్రామంలో ఒకే పేరుగల వ్యక్తులు మహా అయితే 10 మంది ఉంటారేమో. కానీ ఆ ఊరిలో ఒకే పేరుతో 200మంది ఉన్నారు. అదే జనగామ(D) లింగాలఘణపురం. త్రేతాయుగం నుంచే ఇక్కడ శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉంది. దీంతో గ్రామస్థుల్లో చాలామంది ‘రాములు’ అనే పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఆ ఊరిలో ఏకంగా 200 మంది ఒకే పేరు పెట్టుకోవడం విశేషం. ఈ తరం పిల్లలకు రాములు అని కాకుండా ‘ర’ అక్షరంతో పేర్లు పెడుతున్నారు.

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. USA ప్రీమియర్స్‌కు అత్యంత వేగంగా 20K+ టికెట్లు అమ్ముడుపోయిన భారతీయ చిత్రంగా ఘనత సాధించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, USలో ఓ రోజు ముందే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంలో చిన్న కొడుకు బ్యారన్ ట్రంప్ కీలకంగా వ్యవహరించారు. 18 ఏళ్ల ఈ సైలెంట్ స్ట్రాటజిస్ట్ యంగ్, న్యూ ఓటర్లను ఆకర్షించేలా క్యాంపెయిన్ వ్యూహలు అమలు చేశారని సమాచారం. జో రోగన్, లోగన్ పాల్ షోల్లో పాల్గొనేలా చేశారు. అమెరికన్ యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే నెల్క్ బాయ్స్, హాట్ గయ్స్ వంటి పాడ్‌కాస్టుల్లో మాట్లాడించారు. డెమోక్రాట్లను వాళ్ల ఆటలోనే ఓడించారు.

కిరణ్ నేగి అనే మహిళ నోయిడా(UP)లోని ఆసుపత్రిలో గర్భాశయంలో కణితి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నారు. తర్వాత ఆమెకు కడుపునొప్పి మొదలైంది. వైద్యులను సంప్రదించినా సరిగా స్పందించలేదు. గతేడాది మరో ఆసుపత్రికి వెళ్లగా కడుపులో 9 అంగుళాల ప్లాస్టిక్ పైపు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు దాన్ని తొలగించారు. తొలుత చేసిన సర్జరీ వైద్యులు తన కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ పైపు వదిలేశారని కిరణ్ వాపోయారు. వారిపై కేసు వేశారు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ నుంచి <<14567225>>ప్రభాస్ లుక్<<>> లీకవడంపై మూవీ టీమ్ స్పందించింది. ఈ ఘటనపై పోలీస్ కేసు పెట్టనున్నట్లు వెల్లడించింది. ‘ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 2 ఏళ్లుగా 2,000 మంది VFX నిపుణులు కృషి చేస్తున్నారు. ఫొటో లీకయినందుకు బాధపడుతున్నాం. దీన్ని షేర్ చేసినా చర్యలుంటాయి. లీక్ చేసినవారిని కనుగొంటే రూ.5 లక్షల బహుమానం ఇస్తాం’ అని ట్వీట్ చేసింది.

TG: మూసీ శుద్ధీకరణ వద్దంటే ప్రజలు KCRను ముక్కలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి చేసిన <<14562731>>వ్యాఖ్యలపై<<>> హరీశ్ రావు మండిపడ్డారు. ‘హింసను ప్రేరేపించేలా మంత్రి మాట్లాడితే సీఎం ముసిముసిగా నవ్వుతున్నారు. ఆయనపై పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదో డీజీపీ చెప్పాలి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నాం. సీఎం విధ్వంసకర మాటలకు సెన్సార్ బోర్డు మాదిరి A సర్టిఫికెట్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా A ఘోర పరాజయం పాలైంది. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. సామ్ కాన్‌స్టాస్ (73*) రాణించడంతో ఆ జట్టు విజయం సాధించింది. తొలి ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టినా కాన్‌స్టాస్ నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా తొలి అనధికారిక టెస్టులో కూడా ఇండియా A 7 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

TG: ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ముంబై PCC కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ‘ఇచ్చిన హామీ ప్రకారం 22 లక్షల మంది రైతులకు రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశాం. మోదీ మాత్రం రైతులను అదానీ, అంబానీ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాల కారణంగా మహారాష్ట్రలోనే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు’ అని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.