News November 9, 2024

మంత్రి కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలి: హరీశ్ రావు

image

TG: మూసీ శుద్ధీకరణ వద్దంటే ప్రజలు KCRను ముక్కలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి చేసిన <<14562731>>వ్యాఖ్యలపై<<>> హరీశ్ రావు మండిపడ్డారు. ‘హింసను ప్రేరేపించేలా మంత్రి మాట్లాడితే సీఎం ముసిముసిగా నవ్వుతున్నారు. ఆయనపై పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదో డీజీపీ చెప్పాలి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నాం. సీఎం విధ్వంసకర మాటలకు సెన్సార్ బోర్డు మాదిరి A సర్టిఫికెట్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2024

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలిచ్చాం: రేవంత్

image

తాము మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదని, ఇదో రికార్డు అని తెలిపారు. శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలిచ్చామో అసెంబ్లీలో రుజువు చేస్తామని, కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ఉద్యోగాలపై BRS చెప్పిందే బీజేపీ చెప్పిందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55వేల ఉద్యోగాలిచ్చారని నిరూపిస్తే ఢిల్లీలో క్షమాపణలు చెప్తానని సవాల్ విసిరారు.

News December 7, 2024

వరంగల్ మిర్చికి అరుదైన ఘనత

image

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాట మిర్చికి అరుదైన ఘనత లభించింది. దీనికి జీయో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్(IPO) ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటా వలె ఉంటాయి. ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్‌లో రూ.లక్ష ధర పలకడం గమనార్హం.

News December 7, 2024

ఢిల్లీని రిషభ్ పంత్ వదిలేయడానికి కారణమిదే: కోచ్

image

రిషభ్ పంత్‌ను IPL వేలంలో LSG రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని పంత్ వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ హేమాంగ్ బదానీ వెల్లడించారు. ‘పంత్ వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తానెంత ధర పలుకుతానో చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా వినలేదు. అన్నట్లుగానే భారీ ధర పలికాడు. మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది’ అని పేర్కొన్నారు.