India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కుట్రపూరితంగానే కలెక్టర్‌పై BRS శ్రేణులు దాడి చేశాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని Dy CM భట్టి విక్రమార్క ఆరోపించారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ‘పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూమి కోల్పోతున్నవారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం’ అని వెల్లడించారు.

APకి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు తమపై తప్పుడు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. ‘ఓ పద్ధతి ప్రకారం మా ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారు. పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని అబద్ధాలు చెప్పారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని ముందు చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత పవన్, పురందీశ్వరి ఆయనకు వత్తాసు పలికారు. గవర్నర్‌తోనూ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు’ అని జగన్ మండిపడ్డారు.

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లే దారిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో నరేందర్ కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

AP:పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆమేరకు నిధులు కేటాయించేవారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది’ అని మండిపడ్డారు.

స్టాక్‌మార్కెట్లు బేరు బేరుమంటున్నాయి. జీవితకాల గరిష్ఠం నుంచి BSE సెన్సెక్స్ 2 నెలల్లోనే 8300 పాయింట్లు నష్టపోయింది. NSE నిఫ్టీ 26277 నుంచి 10% తగ్గింది. సూచీలు 20% తగ్గితే బేర్స్ గ్రిప్‌లోకి వెళ్లినట్టు భావిస్తారు. నిఫ్టీ 200 DMAను టచ్ చేయడం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ₹1000Cr MCap మీదున్న 900 స్టాక్స్ 20% క్రాష్ అవ్వడంతో బేర్ మార్కెట్లోకి ఎంటరవుతున్నామని ఇన్వెస్టర్లు నిరాశ చెందుతున్నారు.

AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెకండ్ హాఫ్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు నటి రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తవగా అది అద్భుతంగా వచ్చింది. పూర్తి సినిమాను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా, పట్నాలో ఈనెల 17న ట్రైలర్ ఈవెంట్ జరగనుంది.

భారత ఓపెనర్ అభిషేక్ వైఫల్యాలపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆల్రెడీ గిల్, జైస్వాల్ ఓపెనింగ్ స్థానం కోసం రెడీగా ఉన్నారు. 2 సెంచరీలతో శాంసన్ తన స్థానాన్ని ఖరారు చేసుకున్నట్లే. కానీ అభిషేక్ మాత్రం జింబాబ్వేపై సెంచరీ తప్పితే ఏ మ్యాచ్‌లోనూ 3వ ఓవర్ దాటి ఆడట్లేదు. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు అతడికి చావో రేవో. ఛాన్సులు అందిపుచ్చుకోకుంటే జట్టులో మళ్లీ చోటు దక్కదు’ అని హెచ్చరించారు.

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(25) కెరీర్లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో 5 వికెట్లు తీశారు. అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన ప్లేట్ మ్యాచ్‌లో గోవా తరఫున 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో తొలిరోజే 84 పరుగులకు అరుణాచల్ ఆలౌట్ అయింది. దీనికి ముందు జరిగిన తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ అనధికారిక మ్యాచ్‌లో అర్జున్ 9 వికెట్లు తీయడం విశేషం.

ఫైబర్ యూజర్ల కోసం IFTV పేరిట BSNL 500కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు చూసే అవకాశం కల్పించింది. డేటా, బఫర్ సమస్యలు లేకుండా, క్వాలిటీతో వీటిని వీక్షించవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఆండ్రాయిడ్ 10, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు BSNL లైవ్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో తొలుత ఈ సేవలు ప్రారంభించగా, త్వరలో మిగతా రాష్ట్రాల్లో అమలు చేయనుంది.
Sorry, no posts matched your criteria.