News November 13, 2024
తొలిసారిగా 5 వికెట్లు తీసిన సచిన్ కుమారుడు
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(25) కెరీర్లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో 5 వికెట్లు తీశారు. అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన ప్లేట్ మ్యాచ్‌లో గోవా తరఫున 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో తొలిరోజే 84 పరుగులకు అరుణాచల్ ఆలౌట్ అయింది. దీనికి ముందు జరిగిన తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ అనధికారిక మ్యాచ్‌లో అర్జున్ 9 వికెట్లు తీయడం విశేషం.
Similar News
News December 11, 2024
నేడు ఆ ల్యాండ్ మార్క్ దాటనున్న పుష్ప-2?
పుష్ప-2 విడుదలైన 5 రోజుల్లో(నిన్నటి వరకు) రూ.922 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం మూవీ నిన్న రూ.52.50 కోట్లు వసూలు చేసింది. ఆ ట్రెండ్ కొనసాగితే ఈరోజు ముగిసేసరికి ఆ మూవీ గ్రాస్ రూ.1000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారంలోనే ఆ ఘనత సాధించిన తొలి భారత సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టిస్తుంది.
News December 11, 2024
మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్?
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన 5 రోజుల మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ సాధించలేదని, అందుకే ఈ టూర్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. SMATలో భాగంగా బరోడాతో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో ఆయన ఆడతారని తెలుస్తోంది. ఇందులో ఆయన ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షిస్తారని సమాచారం. కాగా చివరి మూడు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్తారని ఇప్పటివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 11, 2024
STOCK MARKETS: బ్యాంకు, ఫైనాన్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్
స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ఆరంభమయ్యాయి. నిఫ్టీ 24,625 (+12), సెన్సెక్స్ 81,536 (+27) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 53,396 (-181) వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ADV/DEC రేషియో 30:19గా ఉంది. బ్యాంకు, ఫైనాన్స్ రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, మీడియా, రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ పెరిగింది. HCLTECH, ICICIBANK, DRREDDY, HDFC ANK, WIPRO టాప్ లూజర్స్. అల్ట్రాటెక్ 2.21% ఎగిసింది.