India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సొంతగడ్డ HYDలో ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఈనెల 27న జరిగే హైదరాబాద్-ముంబై మ్యాచ్ టికెట్లు చాలా మందికి దొరకలేదు. తాజాగా SRH-CSK టికెట్లు పెట్టిన కొద్దిసేపట్లోనే అందుబాటులో లేకుండా పోయాయి. పూర్తి కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచట్లేదని, బ్లాక్ చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రియమణి, యామీ గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ 370. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రూ.20 కోట్లతో తెరకెక్కగా.. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జియో సినిమాలో ఏప్రిల్ 19 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే పారదర్శకంగా పోలీస్ నియామకాలు చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. తాడేపల్లిలో ప్రచారంలో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు గొడవలు సృష్టిస్తారు. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ఫస్ట్ ఓవర్ హార్దిక్ వేయడంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ స్పందించారు. ‘హార్దిక్ GT జట్టులో ఉండగా గత 2 సీజన్లలో కొత్త బంతితో బౌలింగ్ చేసి రాణించాడు. స్వింగ్‌ను ఉపయోగించుకోవాలనేదే అతని ఉద్దేశం. అతని నిర్ణయంలో తప్పులేదు. అలాగే డేవిడ్‌ను హార్దిక్ కంటే ముందు బ్యాటింగ్‌కు పంపడం టీమ్ తీసుకున్న నిర్ణయం. హార్దిక్ సొంత నిర్ణయం కాదు’ అని తెలిపారు.
కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్యప్రగతి పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి BJPలో చేరారు. బెంగళూరులో మాజీ CM యడ్యూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తన KRPP పార్టీని BJPలో విలీనం చేస్తున్నట్లు జనార్దన్ ప్రకటించారు. BJPలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆయన.. BJP అనేది తన రక్తంలోనే ఉందన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.
AP: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. ఇటు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
TG: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావట్లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్(D) మల్లారెడ్డిపల్లికి చెందిన కార్తీక్.. బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులు అతని పేరెంట్స్‌తో మాట్లాడగా, తమ పెద్ద కొడుకు పెళ్లాయ్యాకే చిన్న కొడుకు(కార్తీక్) వివాహం చేస్తామన్నారు. దీంతో ఆలస్యమవుతోందని పెద్దలు ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలిసి కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు.
TG: హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.
క్వాలిటీలో రాజీ పడకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండియన్-2, 3 చిత్రాల షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఇండియన్-2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆ తర్వాత మూడో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం. కల్కి 2898ADలో నా భాగం షూటింగ్ పూర్తి చేశాం. ఎన్నికలు ముగిశాక మణిరత్నంతో థగ్ లైఫ్ మూవీ చిత్రీకరణ మొదలు పెడతాం’ అని తెలిపారు.
గోవాలో తొలిసారిగా బీజేపీ నుంచి ఓ మహిళ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది. పల్లవి భర్త శ్రీనివాస్.. గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నారు. కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది.
Sorry, no posts matched your criteria.