news

News November 28, 2024

డిసెంబర్ 1 నుంచి మరో హామీ అమలు: టీడీపీ

image

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ‘వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పింఛనుదారు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని పేర్కొంది.

News November 28, 2024

KTRకు సీతక్క సవాల్

image

TG: దిలావర్‌పూర్‌లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి KTR పర్మిషన్ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రిగా ఉండి గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా తలసాని కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. KTRకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావాలని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని సవాల్ విసిరారు.

News November 28, 2024

పాటలకు AI వాయిస్.. SPB కొడుకు ఏమన్నారంటే?

image

లెజెండరీ సింగర్స్ వాయిస్‌ను AI ఉపయోగించి పాటలకు వాడటం కరెక్ట్ కాదని SP.బాలసుబ్రహ్మణ్యం తనయుడు SP.చరణ్ అన్నారు. SPB వాయిస్‌ను వాడేందుకు చాలా మంది సంప్రదించారని, కానీ తాను ఒప్పుకోలేదన్నారు. ఏ పాటనైనా పాడాలా వద్దా అనేది ఆ సింగర్ ఇష్టమని, అలాంటప్పుడు లేని వారి గొంతును మనకు నచ్చిన పాటలకు వాడుకోవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఒరిజినల్‌గా పాడితే వచ్చే ఎమోషన్ AI సాంగ్‌లో ఉండదని తెలిపారు.

News November 28, 2024

వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదు: సుప్రీంకోర్టు

image

వివాహేతర సంబంధాల్లో సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు రేప్‌కేసులు పెట్టే సంస్కృతి పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే కచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమని జస్టిస్‌లు BV నాగరత్న, కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. ముంబై ఖర్గార్ స్టేషన్లో ఓ వివాహితుడిపై ఏడేళ్ల క్రితం విడో పెట్టిన కేసును కొట్టేసింది.

News November 28, 2024

మేం కక్ష సాధింపులకు పాల్పడట్లేదు: మంత్రి డోలా

image

AP: గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పుచేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్ట నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని విమర్శించారు.

News November 28, 2024

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?

image

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్‌కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?

News November 28, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

AP: జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేటు విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని తెలిపింది.

News November 28, 2024

కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ఐపీఎస్‌ల సంఘం

image

సిరిసిల్ల కలెక్టర్, పోలీసులపై <<14720925>>KTR చేసిన ఆరోపణలను<<>> IPSల సంఘం ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారులపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆరోపణలు ఉన్నాయని, నిరాధార ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. అధికారుల గౌరవం కాపాడేందుకు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. SRCL కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని KTR ఆరోపించారు.

News November 28, 2024

ప్రధాని మోదీని కలిసిన జైశంకర్

image

విదేశాంగ మంత్రి జైశంకర్ PM మోదీని కలిశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ అంశంపై జైశంకర్ ప్రకటన చేస్తే ఉభయసభలు సజావుగా జరుగుతాయని BJP అధిష్ఠానం భావిస్తోంది. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ అరెస్ట్ చేయగా అక్కడి హిందువులు నిరసన తెలిపారు. ఆ సమయంలో అడ్వకేట్ సైఫుల్ ఇస్లాం అలీ హత్య జరిగిన విషయం తెలిసిందే.

News November 28, 2024

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేఏ పాల్ పిటిషన్ కొట్టివేత

image

TG: పార్టీ మారిన MLAలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలన్న కేఏ పాల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ MLAలపై నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉందని కోర్టు తెలిపింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఇటీవలి తీర్పులో చెప్పామని పేర్కొంది. నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కాగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని పాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.