India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. 46 మంది కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో తెలంగాణ నుంచి ఎలాంటి పేరు లేదు. అస్సాం, అండమాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులను ప్రకటించింది.
మాస్కోలో జరిగిన మారణకాండను ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ తాలిబన్లు, హమాస్ ప్రతినిధులు ప్రకటించారు. మృతి చెందిన పౌరులకు సంతాపం, రష్యా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు హమాస్ తెలిపింది. మాస్కోలో సంగీత కచేరి జరుగుతుండగా తుపాకులతో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 150 మంది మరణించారు. UNO భద్రతా మండలితో పాటు పలు దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
వియత్నాంలో డాక్టర్లే ఆశ్చర్యపోయే కేసు ఎదురైంది. ఓ రోగి(34) తీవ్రమైన కడుపు తిమ్మిర్ల సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. అతడికి అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే తీశారు. ఆ రిపోర్టుల్లో సదరు రోగి మలద్వారంలో 30సెంటీమీటర్ల లైవ్ ఈల్(బతికున్న చేప) చిక్కుకున్నట్లు తేలింది. దాని ఫలితంగా రోగికి తిమ్మిర్ల సమస్య వచ్చిందని వైద్యులు తేల్చారు. వెంటనే సర్జరీ చేశారు. ఆ జీవి పాయువు ద్వారా లోపలికి ప్రవేశించి ఉండొచ్చని అన్నారు.
TG: ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించకుండా తమకు అందుబాటులో ఉంచాలని గ్రామీణ ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సర్కారు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇసుకను స్థానికంగా అందుబాటులో ఉంచాలని, ఇళ్ల నిర్మాణ పథకాలకు ఉచితంగా సరఫరా వంటి నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. తెలంగాణ ఇసుక మైనింగ్ నిబంధనలు-2015 కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉండేది. టీ20 క్రికెట్లో ఒక్క నోబాల్ కూడా వేయని పేస్ బౌలర్‌గా ఉన్న రికార్డు తాజాగా చెరిగిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున IPLలో ఆడుతున్న భువీ ఒక నోబాల్ వేశారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో లైన్ దాటి(ఓవర్ స్టెప్) బౌలింగ్ వేయడంతో అంపైర్ నోబాల్ ప్రకటించారు. టీ20ల్లో భువనేశ్వర్‌కు ఇదే తొలి నోబాల్. ఈ మ్యాచ్‌లో 4ఓవర్లలో 51రన్స్ ఇచ్చారు.
CM కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించడం, దానిపై భారత్ ప్రతిస్పందించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముంగిట ఈ అరెస్ట్‌ను ఎలా చూస్తారు? అని జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సెబాస్టియన్ ఫిస్చర్‌ను ఇక్కడి మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి స్పందనగా.. ‘అందరిలాగే కేజ్రీవాల్ కేసులో కూడా నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. న్యాయపరమైన సహాయ సహకారాలు అన్నీ అందాలి’ అని సెబాస్టియన్ అన్నారు.
టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ పోనీటెయిల్ లుక్‌తో దర్శనమిచ్చారు. CSK క్యాంపులో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పొడవాటి జుట్టును పెంచిన తలా.. ఇటీవల కొత్త హెయిర్ స్టైల్‌లతో ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. కాగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచులో గెలిచిన CSK.. తన తర్వాతి మ్యాచును ఈనెల 26న గుజరాత్‌తో ఆడనుంది.
TG: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ప్రణీత్, అతని టీమ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2kms దూరం నుంచే ట్యాపింగ్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరూ ప్రణీత్‌తో కలిసి ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు.
రష్యాలో మారణహోమానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మాస్కోలో జరిగిన ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించాలని పిలుపునిచ్చారు. ఇది అనాగరిక ఉగ్రవాద చర్య అని, 11 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందినట్లు పుతిన్ పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు 133 మంది మరణించారు.
AP: మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 4 ప్రాంతీయ ‘సిద్ధం’ సభలను నిర్వహించిన వైసీపీ.. రాష్ట్రంలోని 21 చోట్ల భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సభలకు ‘మేమంతా సిద్ధం’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ నెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూర్‌లో సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.