News March 23, 2024
పోనీటెయిల్ లుక్‌తో ధోని.. ఫొటో చూశారా?
టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ పోనీటెయిల్ లుక్‌తో దర్శనమిచ్చారు. CSK క్యాంపులో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పొడవాటి జుట్టును పెంచిన తలా.. ఇటీవల కొత్త హెయిర్ స్టైల్‌లతో ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. కాగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచులో గెలిచిన CSK.. తన తర్వాతి మ్యాచును ఈనెల 26న గుజరాత్‌తో ఆడనుంది.
Similar News
News September 9, 2024
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మాదే: హేజిల్‌వుడ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటామని ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తాజాగా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు BGT కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2014లో హేజిల్‌వుడ్ టెస్టుల్లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు భారత్‌తో ఆడిన ఒక్క టెస్టు సిరీస్ కూడా ఆస్ట్రేలియా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో గెలుపుకోసం తాము ఆకలిగా ఉన్నామని జోష్ పేర్కొన్నారు.
News September 9, 2024
ట్రిలియనీర్లుగా మారనున్న మస్క్, అదానీ!
ప్రపంచ కుబేరుడిగా పేరు తెచ్చుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2027నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా మారుతారని ఓ నివేదికలో వెల్లడైంది. ట్రిలియన్ డాలర్ అంటే సుమారు రూ. 83 లక్షల కోట్లు. మస్క్ సంపద సగటున 110 శాతం చొప్పున పెరుగుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద వార్షికంగా 123% వృద్ధి చెందితే ఆయన 2028నాటికి ట్రిలియనీర్‌గా మారుతారని అంచనా. కాగా మార్క్ జుకర్‌బర్గ్‌కు మరో రెండేళ్లు పట్టొచ్చు.
News September 9, 2024
ఎంపాక్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
దేశంలో తొలిసారి ఎంపాక్స్ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్రం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనవసర భయాలు లేకుండా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లాల్లో ప్రజారోగ్య సౌకర్యాల స్థాయిపై సమీక్షించాలని, అనుమానితుల గుర్తింపు-ఐసోలేషన్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసులు నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.