India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనమైంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్‌తో కేజ్రీవాల్‌కే లబ్ధి అని కొందరు, బీజేపీకే లాభం అనేది మరికొందరు అనుకుంటున్నారు. అయితే ఏ పక్షానికీ పూర్తిగా లబ్ధి ఉండదనేది విశ్లేషకులు మాట. ప్రతిపక్ష నేతల అరెస్ట్‌తో సింపతీ వస్తుందనే గ్యారంటీ లేదంటున్నారు. అందుకు గతంతో జరిగిన అరెస్ట్‌లే ఉదాహరణగా చెబుతున్నారు.
తమిళనాడులో దివంగత నేతలు DMK మాజీ చీఫ్ కరుణానిధి, AIADMK మాజీ చీఫ్ జయలలిత ఇద్దరూ జైలుకు వెళ్లిన వారే. ఒకరు జైలుకు వెళ్లినప్పుడు మరొకరు అధికారం చేపట్టారు. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే ప్రత్యర్థికి అవకాశం వచ్చిందని, ఆ నాయకుల మీద సానుభూతితో కాదనేది విశ్లేషకుల మాట. చిదంబరం, లాలూ, డీకే శివకుమార్, యడియూరప్ప.. డీఎంకే నేతలు రాజా, కనిమొళి మొదలైన వారు జైలుకు వెళ్లొచ్చినా సింపతీ వర్కౌట్ కాలేదు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో BRS MLC కవిత అరెస్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వలాభానికి వాడుకుంటోందని బీజేపీపై ఆరోపణలు ఉన్నా వాటి ప్రభావం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల మాట. అరెస్ట్‌లు సరైన కారణాలతోనే జరుగుతున్నా ఏజెన్సీల వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనికి ఏజెన్సీలు చెక్ పెట్టకుంటే అది వాటి విశ్వసనీయతపై ప్రభావం చూపొచ్చని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై కోర్టులో విచారణ సందర్భంగా ED కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సోదాల సందర్భంగా కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. మొబైల్‌లోని కొంత డేటా డిలీట్ చేసినట్లు గుర్తించాం. ఆమె ఫోన్‌లోని డేటాను విశ్లేషించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌తో సరిపోల్చి చూశాం. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు చెప్పాలని కోరగా, ఆమె తెలియదని చెప్పారు. అతడు ఇప్పుడు కనిపించట్లేదు’ అని పేర్కొంది.
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. మళ్లీ 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ఈ 3 రోజులు అరవింద్ కేజ్రీవాల్‌తో కలిపి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.
పంజాబ్‌లో సంగ్రూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై దాదాపు 40 మంది ఆస్పత్రిపాలవగా, వారిలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇవాళ తొలి మ్యాచ్ ఆడనున్నారు. కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు దక్కించుకున్న SRH కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రూ.24.75 కోట్ల రికార్డు ధరతో KKR సొంతం చేసుకున్న పేసర్ స్టార్క్ కీలక బౌలర్‌గా బరిలోకి దిగనున్నారు. అతడు ఒక్క బంతి వేస్తే సుమారు రూ.7.36 లక్షలు సంపాదిస్తారు. మరి ఈ కోట్ల వీరుల ప్రదర్శన ఎలా సాగుతుందన్నది ఆసక్తికరం.
కవిత ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఆమెను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ వాదించింది. తన క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు లాయర్ కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. అయితే కోర్టు రూమ్‌లోనే తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలవడానికి కవితకు జడ్జి అనుమతి ఇచ్చారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోజు గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ అనే పాట ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. దీంతో జడ్జి నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.