News November 15, 2024
రోహిత్ పారిపోయే కెప్టెన్ కాదు: కైఫ్
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్‌కు వచ్చేస్తారు’ అని తెలిపారు.
Similar News
News December 14, 2024
అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరు విడుదల
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేటు నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
News December 14, 2024
రాష్ట్రంలో 9లక్షల కేసులు పెండింగ్
AP: రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. టీడీపీ MP పుట్టా మహేశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఏపీ హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో గత మంగళవారం వరకు 8,99,895 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.
News December 14, 2024
ఆ జిల్లాలకు వర్ష సూచన
AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.